షుగర్ వ్యాధి అనేది ఈ మధ్యకాలంలో చిన్న వయసు వారిలో కూడా ఎక్కువగా వస్తున్న దీర్ఘకాలిక అనారోగ్యం. అనారోగ్యకర జీవనశైలి మార్పుల వలన ఈ సమస్య ఎక్కువగా బాధిస్తోంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం, వ్యాయామం లేకపోవడం, వంశపారంపర్యంగా ఉండడం మధుమేహానికి ముఖ్య కారణాలు.
మధుమేహాన్ని జీవనశైలి మార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మధుమేహం నియంత్రణలో ఉండదో అప్పుడు శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవి రక్తపోటు, గుండె సమస్యలకు కూడా కారణం కావచ్చు. క్రమం తప్పకుండా మందులను వాడడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
కానీ షుగర్ ని పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవడానికి ఆహారంలో మార్పులు చాలా అవసరం. ఉదయాన్నే అల్పాహారంగా మొలకలు తీసుకోవాలి.మొలకకలో ఉండే ప్రొటీన్ శరీరానికి ప్రొటీన్లోపాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. మొలకలు అల్పాహారంలో తీసుకోవడం మధుమేహానికి చాలా మంచిది.
ఉదయం పూట మూడురకాల ఏవైనా గింజలు మొలకలు తీసుకోవడంతో పాటు, అధిక మధుమేహం ఉన్నవారు మెంతులు కలిపి తీసుకుంటే నెమ్మదిగా షుగర్ లెవెల్స్ను తగ్గించుకోవచ్చు. ఇలా నేరుగా గింజలను తీసుకోలేని వారు పండ్లతో కలిపి మిక్సర్లా మొలకలు తీసుకోవాలి. మధ్యాహ్నం ఆహారం రెండు పుల్కాలు లేదా చపాతీలు నూనె లేకుండా చేసుకుని ఉప్పు తక్కువగా ఉన్న కూరగాయలతో చేసిన కూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
సాధారణ కూరగాయలు, పండ్లలో కూడా లవణం శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక శరీరానికి కావలసిన సోడియం ఉప్పు లేకుండానే శరీరానికి అందుతుంది. కూరలుగా కాకపోయినా వెజిటేబుల్ సలాడ్స్ అయిన ఒక కప్పు మోతాదులో మధ్యాహ్నం ఆహారంగా తీసుకోవాలి. సాయంత్రం ఆహారంగా పండ్లను తీసుకోవడం వలన ఉడికించిన ఆహారానికి దూరంగా ఉండవచ్చు.
పండ్ల తో పాటు ఏవైనా డ్రైఫ్రూట్స్ ఒక గుప్పెడు తీసుకోవాలి. రోజు మొత్తంలో ఒక గ్లాసుడు కూరగాయల జ్యూస్, ఒక గ్లాసుడు పండ్ల రసం తీసుకోవడం వలన మీ షుగర్ లెవెల్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒక్కసారే మందులను ఆపకూడదు.అది ప్రాణాంతకంగా మారుతుంది.
జీవనశైలి మార్పుల వలన షుగర్ లెవెల్స్ తగ్గుతుంటే డాక్టర్ సలహాతో మందుల డోసేజ్ తగ్గించుకుంటూ రావాలి. వీటితో పాటు శరీరానికి కావలసినంత నీటిని అందించడం కూడా చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం పోషకాలను అందించడంతో పాటు శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.