How to get rid of a cough in 5 minutes

ఇది గ్లాస్ నీటిలో కలిపి తాగితే చాలు…… దగ్గు జలుబు నుంచి వెంటనే ఉపశమనం ఇస్తుంది……

వాతావరణం మారినప్పుడల్లా లేదా ఏదైనా ప్రదేశాలు మారినప్పుడు వెంటనే మనకు దగ్గు జలుబు వంటివి రావడం సర్వసాధారణం. మన ఇంట్లో నిత్యం ఉండేవి మూడు ఉన్నాయి. అవి ఒకటి అల్లం, రెండు మిరియాలు, మూడు వాము. ఈ మూడు పదార్థాలు మీకు జలుబు దగ్గు వచ్చినప్పుడు మనకు ఎలా ఉపయోగపడతాయని ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అల్లం లో జింజరాలనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఈ అల్లం యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియాల్ గాను పని చేస్తుంది.

                             కాబట్టి ఇన్ఫ్లమేషన్ ను త్వరగా తగ్గించడానికి, గొంతు, ముక్కు భాగాల్లో సైనస్ వంటివి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి నెంబర్ వన్ గా పని చేస్తుంది. రెండవదిగా మిరియాలు గురించి తెలుసుకుందాం. ఇందులో పెప్పరిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. గాలి గొట్టాలలో స్పాజం అనేది టైట్ అవుతుంది. ఈ బీగుచుకునే గుణం తగ్గించడానికి ఈ పేప్పరిన్ అనే కెమికల్ బాగా పనికొస్తుంది. అలాగే మిరియాలు అనేవి గాలి బాగా ఆడేటట్లు చేయడానికి, గాలి గొట్టంలో గాలి వెంటిలేషన్ బాగా జరిగి యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరస్ గా పనిచేసి కఫం తగ్గడానికి బాగా పనికొస్తుంది.

                      దగ్గుకి జలుబుకి రెండిటికి మిరియాలు బాగా పనిచేస్తాయి. మూడవదిగా వాము. వాము జలుబు దగ్గు వచ్చినప్పుడు మంచి మెడిసిన్ లాగా పని చేస్తుంది. వాములో థైమాల్ అనే కెమికల్ ఉంటుంది. మనకు కఫం పట్టినప్పుడు గాలి తిత్తులలో అంతా శ్లేష్మంతో నిండిపోతుంది. గాలి తిత్తుల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించి సరాళంగా చేస్తుంది. అలాగే వీటిని రిపేర్ చేయడానికి వాము అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఈ మూడింటి కాంబినేషన్ చాలా మంచిది. ఎప్పుడైనా ఈ మూడింటిని దగ్గు, జలుబు, కఫం, ఇన్ఫెక్షన్స్ వంటివి ఉన్నప్పుడు ఉపయోగిస్తే మంచిది.

                        ఇవి ఎలా ఉపయోగించుకోవాలి అంటే అంగుళం అల్లం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, స్పూన్ వాము వేసి ఒక గ్లాసు నీళ్లలో మరిగించండి. హాఫ్ గ్లాస్  అయ్యేంతవరకు మరిగించి ఆ తర్వాత ఒక కప్పులోకి తీసుకొని కొంచెం తేనె కలుపుకొని కొంచెం కొంచెంగా టీ తాగినట్టు తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు తాగారంటే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా పాలలో వేసుకోకూడదు నీటిలో మాత్రమే వేసుకోవాలి. దీనిని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు…

Leave a Comment

error: Content is protected !!