మహిళా మణుల వాలు జడల్లో మత్తెక్కించే సన్నజాజులు జడకే అందం తెస్తాయి, అయితే అందరికి చెట్టులో పువ్వులపైనే కన్ను. కానీ సన్నజాజి చెట్టులో ఆకులతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతే కాదండోయ్ ఫుల్లుగా తాగి ఊగిపోయే మందు బాబుల ఆట కట్టించే గమ్మత్తయిన చిట్కాలు కూడా ఉన్నాయ్. అంత ఆశ్చర్యపరిచే విషయాలు ఏమిటా అని అనుమానంగా ఉంటే విషయాన్ని చదవండి మరి.
◆ సన్నజాజి ఆకుల్ని నూరి, రసం తీసి, దానిలో కొద్దిగా మిరియాల పొడి, పిప్పళ్ళ పొడి కలిపి తగినంత పంచదార వేసుకోవాలి. దీనికి తేనె కలిపి పావు గ్లాసు వరకు అవసరాన్ని బట్టి తాగితే, గర్భవతులలో వాంతి, వికారం వంటి ఇబ్బందులు తగ్గిపోతాయి.
◆ వెలగపండు గుజ్జుతో రసం తీసి, దానికి తగినంత పిప్పళ్ళ పొడి, తేనె కలిపి రెండు గంటలకు ఒకసారి పావు గ్లాసు మోతాదులో గర్భవతులకు తాగించాలి. వాంతులయ్యే వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
◆ విపరీతంగా మందుకొట్టి ఊగిపోతున్న వారికి నేతిలో కాసింత పంచదార వేసి తినిపిస్తే మత్తు దిగిపోతుంది.
◆ మర్రి ఊడల కొనలను దంచి మజ్జిగలో కలిపి కాసింత పంచదార జతచేర్చి దాన్ని తాగితే మద్యం ప్రభావం క్రమంగా తగ్గుతుంది.
◆ మద్యపానానికి అలవాటు పడిన వారు ఒక్కసారికే మానివేస్తే, చెడు జరుగుతుందని భావిస్తారు, అయితే ఆయుర్వేదం ఇందుకు చక్కని మార్గం చూపుతుంది.
◆ ఖర్జూరపండ్లు, ద్రాక్ష, చింతపండు, దానిమ్మ గింజల రసం కలిపి, వీటిలో తగినంత నీరు పోసి పులుసులా కాయాలి, ఈ చిక్కటి ద్రవాన్ని రోజూ పావు గ్లాసు చెప్పున తాగుతూ ఉంటే రుచి మాత్రమే కాదు మద్యం సేవించడం వల్ల కలిగే వికారాలు, వణుకు, ఇతర సమస్యలు తగ్గుతాయి.
◆ ఆయుర్వేద షాపులలో దొరికే త్రికటు చూర్ణం అందరికి తెలిసినదే, ఇది విరివిగా లభిస్తుంది కూడా. ఈ త్రికటు చూర్ణానికి మూడవ వంతు కొలతలో సావర్ఛ లవణం కలిపి మజ్జిగతో తీసుకోవాలి. ఇది తీసుకోవడం వలన తాగుడు వాన కలిగే దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది.
◆ ద్రాక్షారిష్ఠ, మాదీఫల రసాయనం రోజూ వాడితే త్రాగుడు అలవాటు మానేయడం వలన కలిగే దుష్ప్రభావాలను అరికట్టవచ్చు.
చివరగా……
పైన చెప్పుకున్న చిట్కాలను అనుసరించి గర్భవతుల ఆరోగ్యం మాత్రమే కాదు వ్యసనమై జీవితాలను కల్లోలం చేసే మద్యపానం కూడా మనము చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే పారిపోవాల్సిందే. ఆరోగ్యమే మహాభాగ్యమని మరవద్దు మరి.