How To Get Rid of Dark Neck Fast in 15minutes in Telugu

మీ మెడ చుట్టూ నలుపు ఈ చిట్కాతో పదిహేను నిమిషాల్లో మాయం

ముఖం తెల్లగా ఉన్నా, మెడ నల్లగా ఉండి చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కొందరికి. దీనికి ముఖ్య కారణం రోల్డ్ గోల్డ్ నగలు వాడడం, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, అధిక బరువు పెరగడం లేదా బంగారం లాంటివి ఎక్కువగా వాడడం వలన ఆ రాపిడికి మెడ నల్లగా తయారవుతుంది. ఇలా మెడ నల్లగా ఉన్నప్పుడు అసలు కారణం తెలుసుకొని వాటిని తగ్గించుకోవడంతో పాటు ఇప్పుడు చెప్పబోయే చిట్కా ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

 మొదట తీసుకోవాల్సింది స్క్రబ్.  స్క్రబ్ కోసం ఈనో లేదా బేకింగ్ సోడా తీసుకోవాలి. ఒక చెంచా ఈనో తీసుకొని అందులో ఒక అర చెక్క నిమ్మరసం పిండాలి. ఇవి రెండూ చర్య జరిగి నురగ వస్తుంది. ఇది మరీ పల్చగా ఉండకూడదు. స్క్రబ్ చేయడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసే ముందు మెడని శుభ్రంగా గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. తర్వాత ఈ మిశ్రమం తో నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి. 

ఇందులో ఉన్న బేకింగ్ పౌడర్ మెడపై పేరుకున్న మురికి జిడ్డును తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. నిమ్మకాయ సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని లైటెన్ చేస్తుంది. దీన్ని పది నిమిషాలు పది నిమిషాల నుండి 15 నిమిషాల వరకు ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఒక గిన్నెలో ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత మంచిది. తర్వాత దీనిలో అర స్పూన్ పసుపు వేసుకోవాలి. 

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి క్రీమి టెక్చర్ లో వచ్చేలా చేయాలి. దీనిని మసాజ్ క్రీమ్ వాడబోతున్నాం. దీన్ని మెడకు అప్లై చేసి  నెమ్మదిగా మసాజ్ చేయాలి. బేకింగ్ సోడా, నిమ్మకాయ రసం మెడపై ఉన్న మురికిని తొలగించి కనుక ఇందులో ఉన్న పెరుగు చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తో చర్మాన్ని మెరిపించడం కాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతుంది. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. ఒక్కసారికే మంచి ఫలితాలను చూస్తారు. ఈ ఫలితాలు ఉండాలంటే కనీసం వారానికి ఒకసారైనా ఈ టిప్స్ పాటించండి. వీటివలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

Leave a Comment

error: Content is protected !!