How To Get Rid Of Dark underarms Live Result

5 నిమిషాల్లో ఎంత నల్లగా ఉన్న మీ చంకలు అయినా సరే తెల్లగా మారుతాయి

     చాలామందికి  సంకలు నల్లగా అయిపోయి ఉంటాయి. టైట్ గా ఉన్న బట్టలు వేసుకోవడం, శరీరం మొత్తం తీసుకునే కేర్ చంకలకు తీసుకోకపోవడం, బరువు పెరగడం ఎక్కువగా చెమట పట్టడం వంటి కారణాల వల్ల చంకలు నల్లగా మారిపోతాయి. వీటి కోసం పార్లర్కు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టనవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే ఉండే పదార్థాలతో నల్లగా ఉన్న  చంకలు తెల్లగా మార్చుకోవచ్చు. పార్లర్ కు వెళ్లకుండా ఇంట్లోనే చేయడం వల్ల డబ్బు మరియు సమయం రెండూ కూడా సేవ్ అవుతాయి.  


     చిట్కా చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ  అంత చింతపండు తీసుకుని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత గుజ్జు ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఎగ్ వైట్ తీసుకోవాలి.  ఎగ్ వైట్ వద్దు అనుకున్న వాళ్లు అలోవెరా జెల్ లేదా అవిసె గింజల జెల్  తీసుకోవాలి. దీంట్లో రెండు చెంచాల పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో ఒక అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.  లెమన్ జ్యూస్ వద్దు అనుకున్న వాళ్లు టమాటా జ్యూస్ లేదా పొటాటో జ్యూస్ వేసుకోవచ్చు. 
     తర్వాత రెండు చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.కార్న్ ఫ్లోర్ వద్దు అనుకున్న వాళ్లు బియ్యప్పిండి లేదా గోధుమపిండి  వేసుకోవచ్చు. తర్వాత రెండు చెంచాల శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి సెనగపిండి వద్దు అనుకున్న వాళ్లు  ముల్తాని మట్టి లేదా గంధపొడి కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలుపుకోవాలి.   ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. పదినిమిషాల తర్వాత ముందుగా రసం  తీసిన నిమ్మచెక్కతో నెమ్మదిగా పాక్ మీద స్క్రబ్ చేయాలి.
       ఇలా చేయడం వలన నల్లగా మారిన  సంకలు నిమిషాల్లో తెల్లగా మారతాయి.ఈ  చిట్కా వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయాలి. ఈ ప్రయత్నం కొరకు మాత్రమే కాకుండా శరీరం మీద టాన్ ఉన్న భాగంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. మెడ కాళ్లు చేతులు మొహం పై నల్లని మచ్చలు పోవడానికి కూడా  ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ  ఈజీ చిట్కా ట్రై చేసి ఇంట్లోనే నల్లగా ఉన్న  చంకలు తెల్లగా మార్చుకోండి. తక్కువ ఖర్చుతో చంకలు తెల్లగా తయారవుతాయి.

Leave a Comment

error: Content is protected !!