How to Get Rid of Gas Stomach Pains Bloating

పరగడుపున ఇలా చేస్తే గ్యాస్ సమస్య జీవితంలో ఉండదు

మలబద్దకం అనేది అందరినీ వేధిస్తున్న పెద్ద సమస్య. ఇదీ ఇలాగే కొనసాగితే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఎక్కువవుతాయి. చాలా మందికి మలవిసర్జనకు వెళ్లాలంటే భయంకరంగా ఉంటుంది ఆ అనుభవం. కొంతమందికి నిమిషాల్లో విరోచనం అయిపోతే. కొంతమందికి విరోచనం అవ్వదు.

దానికి తోడు విపరీతమైన నొప్పి , రక్తస్రావం కాలక్రమంలో ఫైల్స్ వంటి సమస్యలతో ఇబ్బంది కలుగజేస్తుంది. దీనికి సహజమైన మార్గం వేడినీటిని ఎక్కువగా తీసుకోవడం. అదీ ఉదయం లేచిన వెంటనే టిఫిన్ తినకముందే కనీసం లీటరున్నర వరకూ గోరువెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది.

 ఇలా వెచ్చని నీటిని ఉదయాన్నే తాగడం వలన పేగులలో మలం మెత్తగా తయారయి కదలిక వచ్చి మలద్వారం దగ్గరికి వస్తుంది. ఒక్కసారే నీటిని లీటరుపావు వరకు నీటిని తాగలేకపోతే ఐదు నిమిషాల విరామం ఇచ్చి నీటిని తాగాలి. ఇలా తాగడం వలన ప్రేగులలో మలం మెత్తబడుతుంది. ప్రేగుల కదలికలు  సులభమవుతుంది. 

అంతేకాకుండా మలవిసర్జన అత్యవసరం అయ్యేంతవరకూ ఆగాలి. అప్పుడు మలద్వారం దగ్గర ఉన్న మలం మాత్రమే బయటకు వస్తుంది. ప్రేగులలో ఉండిపోయిన మలం పూర్తిగా బయటకు వచ్చేందుకు  సమయం పట్టొచ్చు. వేడినీటిని తరుచు తాగడంవలన పొట్ట పూర్తిగా  శుభ్రపడుతుంది. అందుకే మలం నిండి మలవిసర్జన అత్యవసరం అయ్యేంతవరకూ ఆగాలి. అలా ఆగడం వలన మలవిసర్జన క్షణాల్లో జరిగిపోతుంది. ప్రేగులు పూర్తిగా శుభ్రపడతాయి.

ఉదయాన్నే ఇలా లీటరుపావు నీటిని తాగడం వలన విరోచనం కూడా చాలా సులభం అయినట్టు చాలామంది పేర్కొన్నారు. దీనిని రోజువారీ అలవాటుగా మార్చుకుంటే మలబద్దక సమస్య ఉండదు. నీటిని తాగిన తర్వాత ప్రేగుల కదలికలపై మనసును కేంద్రీకరించడం వలన కండరాలు వదులై విసర్జన ఇంకా సులభం అవుతుంది. 

అంతేకాకుండా మసాలాలు, నూనెలో వేయించిన మాంసాహార పదార్థాలు, మైదాతో చేసిన పదార్థాలు వీలైనంత తగ్గించి సహజమైన కూరగాయలు,  తీసుకోవాలి. రాత్రి సమయంలో పండ్లు మాత్రమే ఆహారంలో  తీసుకోవడం వలన కూడా మలబద్ధకం, గ్యాస్ సమస్య తగ్గుతుంది.

ఆహారంలో లభించే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. దానికోసం ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. వీటితో ఎనిమా కూడా ప్రేగులను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. రాత్రి త్వరగా ఆహారం తీసుకోవడం, శరీరానికి తగినంత వ్యాయామం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, ఉదయాన్నే లీటరున్నర నీళ్లు తాగాలి.

రోజంతటి మీద నాలుగైదు లీటర్ల నీటిని గోరువెచ్చగా తాగడం మలబద్దక సమస్య తగ్గడంలో చాలా బాగా సహాయపడుతాయి. ఇవన్నీ పాటిస్తూ నీటిని కూడా తాగడం వలన మలబద్దకాన్ని, గ్యాస్ సమస్యలు మాత్రమే కాకుండా అనేక ఇతర అనారోగ్యసమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.

1 thought on “పరగడుపున ఇలా చేస్తే గ్యాస్ సమస్య జీవితంలో ఉండదు”

  1. నాపేరు శ్రీశైలం నేను నల్గొండ జిల్లా దేవరకొండ లో ఉంటాను , నేను మూర్ఛ రోగం ద్వారా గత 10సంవత్సరముల నుండి బాధ పడుతున్నాను , తగ్గడానికి మీరు తగిన వైద్యం ఇప్పిస్తే నేను సంతోషిస్తాను………

    Reply

Leave a Comment

error: Content is protected !!