How To Get Rid of Lizards Permanently

2నిమిషాల్లో ఇంట్లో నుంచి బల్లులు బయటకు పారిపోతాయి

ఇంట్లో బల్లులు విపరీతంగా ఉంటే  జుగుప్స కలుగుతుంది. అంతే కాకుండా వాటి వల్ల అంటు రోగాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. ఇవి పొరపాటున తినే ఆహార పదార్థాలలో పడితే అదే విషంగా పరిణమించి ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం వచ్చేసింది. ఇంట్లోకి పురుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి కోసం బల్లులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 

అయితే వీటికి ఎన్ని రకాలు చిట్కాలు పాటించినా ఇవి బయటకు పోవు కదా కింద నడుస్తూ భయానికి గురి చేస్తూ ఉంటాయి. బల్లులు నుండి ఉపశమనం కోసం మనం తయారు చేసుకోవడానికి చిన్న చిట్కా ఉంది. ఇది మన ఇంట్లో ఉండే పదార్థాలతో చేయడం వలన ఎటువంటి రసాయనాలు ఉండవు. బయట కొన్ని కెమికల్ స్ప్రేలు దొరికిన చిన్న పిల్లలు ఉండే ఇంట్లో వాటితో భయమేస్తుంది.

 బల్లులను బయటకు తరిమేసే చిట్కా కోసం మనకు కావలసిన పదార్థాలు ఒక పెద్ద ఉల్లిపాయ, కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, ఒక డెటాల్ సోప్ లేదా డెటాల్ లిక్విడ్. దీనికోసం మనం ఉల్లిపాయ పొట్టు తీసి తురుముకోవాలి. దీని నుండిఉల్లి రసం  వడకట్టుకోవాలి. తర్వాత మిరియాలు, లవంగాలు పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు వేసుకొని దీనిలో వడకట్టి తీసుకున్న ఉల్లిపాయ రసం ఒక స్పూన్ లవంగాలు, ఒక స్పూన్ మిరియాల పొడులు వేసుకోవాలి.

 తర్వాత ఇందులో డెటాల్ లిక్విడ్ ఉంటే వేసుకోవాలి. లేదా డెటాల్ సోప్ తురిమి అది కలిపినా సరిపోతుంది. తర్వాత ఎక్కడైతే ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయో అక్కడ  ఈ ద్రావణాన్ని స్ప్రే చేయాలి. ముఖ్యంగా కిచెన్ లోని గట్టు, గోడలు, డబ్బాలు ఉండే కిచెన్ కబోర్డ్లో స్ప్రే చేయాలి. అలాగే ఇంట్లోకి రాకుండా చేయడానికి కింద తిరగకుండా చేయడం కోసం మట్టి ప్రమిదలు లేదా చిన్న గిన్నెలలో ఈ ద్రావణాన్ని దూదిలో ముంచి ఆ దూది ఉండలు పెట్టాలి. 

దీనినుంచి ఘాటైన వాసన వస్తూ ఉంటుంది. మనకి బాగానే ఈ వాసన బాగానే ఉన్నా బల్లులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి బయటకు పారిపోతాయి. పురుగులు, చీమలు వంటివి కూడా ఈ ద్రావకం వాసన వలన బయటకు పోతాయి. ఈ చిట్కాతో బల్లులను బయటకు తరమడం చాలా సులభం అయిపోతుంది. అలాగే ఇంట్లో నెమలీకలు ఎక్కువగా పెట్టడం వల్ల కూడా బల్లులు ఇంట్లోకి రావు. మనకు అందంగా కనిపించే నెమలీకలు బల్లులను భయపెడతాయి.

Leave a Comment

error: Content is protected !!