how to get rid of rats at home

ఇలా చేస్తే చాలు 5 నిముషాలలో మీ ఇంట్లో ఉండే ఎలుకలు మొత్తం పారిపోతాయి. ఒక ఉండ చాలు మళ్ళీ రమ్మన్నా రావు

ఎలుకలు ఇంట్లో ఉంటే చాలా చిరాకుగా, మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మనకి పెద్దగా హాని చేయకపోయినా ఇంట్లో సామాన్లు అన్ని పాడుచేస్తూ ఉంటాయి. ఇంట్లో ఉండే ఆహార పదార్దాలు, వస్తువులు, బట్టలు అన్ని పాడుచేస్తాయి. మార్కెట్లో దొరికే ఎన్నో రకాల మందులు ట్రై చేసిన ఎలుకలు బెడద తగ్గదు. అలాంటి ఎలుకలని మీ ఇంట్లో నుండి ఈ చిట్కాతో పోతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎలుకలు మీ ఇంట్లో నుండి వెళ్లగొట్టలేకపోతున్నారా ! ఐతే ఈ చిన్న చిట్కా ట్రై చేసినట్లయితే మీ ఇంట్లో ఒక ఎలుక కూడా మిగలదు.

ఈ  చిట్కా కోసం కావాల్సిన పదార్దాలు పొగాకు, సెనగపిండి, ఆవు నెయ్యి. ఈ చిట్కా చేసుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. పొగాకు లేదా చుట్టిన చుట్టలు తీసుకున్న పర్వాలేదు. మీకు ఏది దొరికితే అది తీసుకోవచ్చు. పొగాకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ చిట్కా కోసం ఒక పొగాకు రెమ్మ సరిపోతుంది. ఈ పొడిలో చిన్న చెంచాతో  2 చెంచాల ఆవు నెయ్యి వేసుకోవాలి.Bతర్వాత దీనిలో 4 చెంచాల సెనగపిండి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతితో బాగా కలుపుకోవాలి.

తర్వాత దీనిలో కొంచెం నీళ్లు వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను ఎలుకలు తిరిగే చోట సర్దిపెట్టాలి. ఎలుకలు ఈ ఉండలను తిన్న వెంటనే చచ్చిపోతాయి. ఈ చిట్కా పాటించినపుడు ఎలుకలు తిరిగే చుట్టు పక్కల నీళ్లు లేకుండా జాగ్రత్త పడాలి. ఎలుకలు ఈ మిశ్రమాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగితే చచ్చిపోకుండా బ్రతికేస్తాయి. ఈ చిట్కా ట్రై చేసినపుడు ఎలుకలకు నీళ్లు దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అన్నం, కూర వంటి ఆహార పదార్దాలపై పెట్టి ఈ చిట్కా ట్రై చేయాలి. ఎలుకలు తిన్నా తర్వాత నీటి కోసం వెతుక్కుంటూ ఆహార పదార్దాలలో పడిపోయే అవకాశం ఉంది. 

ఎన్ని మందులు పెట్టిన  ఎన్ని చిట్కాలు ట్రై చేసిన పోని ఎలుకలు ఈ చిట్కాతో ఈజీగా పోతాయి. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఎలుకల నుండి ఈ చిట్కాతో ఈజీగా తప్పించుకోవచ్చు. ఈ చిట్కా ట్రై చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది. మీరు కూడా ఈ ఈజీ చిట్కాతో ఎలుకలని తరిమేయొచ్చు.

Leave a Comment

error: Content is protected !!