కొంతమందికి శరీరం నుండి దుర్వాసన చాలా ఎక్కువగా వస్తుంది. దాని వల్ల ఇబ్బంది పడటమే కాకుండా వాళ్లతో పాటు ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దుర్వాసన నుండి రక్షించుకోవడానికి పౌడర్లు,సెంట్లు, బాడీ స్ప్రేస్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. చెమట దుర్వాసన శరీరంలోమలినాలు ఎక్కువ అవ్వటం వల్ల దుర్వాసన వస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉన్నా సరే దుర్వాసన వస్తుంది.
దుర్వాసన తగ్గించుకోవడానికి కొంతమంది సోపులు వాడతారు దీనివల్ల పావుగంట నుంచి అరగంట వరకు మాత్రమే దుర్వాసన రాకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ దుర్వాసన మొదలవుతుంది. బాడీ స్ప్రే, పౌడర్లు , సెంట్లు వంటివి ఉపయోగించడం వలన మూడు నుంచి నాలుగు గంటల వరకు దుర్వాసన నుండి కాపాడుతాయి. తర్వాత మళ్ళీ మామూలుగా దుర్వాసన మొదలవుతుంది సరేలే నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే శరీరంలో ఉన్న మొత్తం మలినాలు శుభ్రపడాలి.
శరీరంలో ఉండే టాక్సిన్స్ మొత్తం బయటకి పోతేనే చమట దుర్వాసన తగ్గుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా సరిగా తీసుకోవాలి. రోజుకు 4-5లీటర్ల నీళ్లు తాగాలి. నేచుర్ క్యూర్ సెంటర్ లో వారానికి రెండు లేదా మూడు సార్లు మసాజ్ చేయించుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిపోతుంది. తర్వాత బ్రాలు ఓపెన్ అవడం వలన చెమట రూపంలో టాక్సిన్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఈ రోజు మొత్తం ఎక్కువ నీటిని తాగడం వలన యూరిన్ లో రూపంలో కొన్ని మలినాలు బయటకు పోతాయి.
దీనివల్ల కూడా చెమట దుర్వాసన తగ్గుతుంది వారంలో రెండు లేదా మూడు సార్లు స్టీమ్ బాత్ సన్ బాత్ వంటివి చేయడం వల్ల లీటర్నర వరకు చెమట బయటకు వస్తుంది. రోజుకి రెండు సార్లు స్నానం చేయాలి. మధ్యాహ్నం ఒకసారి తొడలు గజ్జలు కడుక్కోవడం వలన దుర్వాసన తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి వలన చమట దుర్వాసన తగ్గుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోవడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదల కూడా తగ్గుతుంది.
దుర్వాసన వస్తుంది అంటే మీకు దీర్ఘ రోగాలు వచ్చే అవకాశం ఉందని సూచన. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, మంచి జీవనశైలి వలన చెమట దుర్వాసన సమస్య తగ్గుతుంది. సబ్బులు, పౌడర్లు, సెంటులు ఉపయోగించడం వలన తాత్కాలిక పరిస్కారం తప్ప శాశ్వత పరిస్కారం ఉండదు. మీరు కూడా ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే చమట దుర్వాసన సమస్య తగ్గుతుంది.