చాలా మనది ఎదుర్కొనే సమస్య ఒకటి ఉంటుంది. చెమట వల్ల బాహుమూలల్లో దుర్గంధం రావడం. ఎన్ని సార్లు స్నానం చేసిన ఎంత శుభ్రంగా ఉంచుకున్నా చెమట ఊరి అది దుర్వాసనగా మారడమే కాకుండా వేసుకున్న దుస్తుల మీద చెమట తాలూకు తడితో మరకలుగా కనిపిస్తూ ఉంటుంది. నలుగురిలో ఇలా చెమటకు దుస్తులు తడి అవడం కూడా కాసింత ఇబ్బందిగానే అనిలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అయితే చెమట నుండి ఉపశమనాన్ని ఇస్తూ అసహనాన్ని, చిరాకును దూరం చేయడానికి తేలికగా మరియు ఖర్చుతో కూడుకున్న కొన్ని సహజ ప్రత్యామ్నాయాలను ఉపయోగించం వల్ల ఈ సమస్యను జయించవచ్చు. అవేంటో చూద్దాం మరి.
◆ ఆపిల్ సైడర్ వెనిగర్ ను బాహుమూలల్లో నేరుగా అప్లై చేయాలి. యాంటీమైక్రోబయల్ లక్షణాలు మరియు ఆమ్ల స్వభావం బాహుమూలల్లో వాసన కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
◆ఈ సమస్యకు మరొక చక్కని ప్రత్యామ్నాయం గా నిమ్మకాయ ఉపయోగపడుతుంది. నిమ్మరసం మరియు బేకింగ్ సోడా రెండూ కలిపి బాహుమూలల్లో అప్లై చేయాలి. కాసేపయ్యక కడిగేసుకోవాలి. దుర్గంధానికి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి మరియు అసౌకర్యాన్ని కలిగించే చెమటను ఉత్పత్తి చేయడాన్ని నివారించడంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది.
◆సాధారణంగా గాయాలు తగిలినపుడు వాటిని క్లీన్ చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతుంటాము. అది ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ను నీటిలో కలపాలి ఈ నీటితో బాహుమూలలను క్లీన్ చేసుకోవాలి . హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క క్రిమినాశక లక్షణాలు అసహ్యకరమైన శరీర వాసనను నిర్ర్మూలించడానికి సహాయపడతాయి.
◆ గంధపు పొడి లేదా చందనం పొడి అనేది అండర్ ఆర్మ్ వాసనను ఎదుర్కోవటానికి ఒక ప్రభావవంతమైన పరిష్కారం. గంధం లేదా చందనం ఇచ్చే పరిమళం చెమట వాదనను నిర్మూలించడంలో సహాయపడుతుంది. అంతేకాదు చెమట ఉత్పత్తి అవ్వడాన్నీ మందగించేలా చేస్తుంది.,
◆ టూత్ పేస్ట్ లో కొన్ని రకాల పదార్థాల తయారీలో సువాసన కోసం ఉపయోగించే సుగంధ నూనెలలో ఒకటి టీ ట్రీ ఆయిల్. ఈ టీ ట్రీ ఆయిల్‌లో లభించే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు బాహుమూలల్లో వాసన తగ్గించడానికి మరియు వాసన కలిగించే బ్యాక్టీరియాను నిర్మూలించడానికి చక్కగా పని చేస్తుంది.
◆ ప్రతి ఇంట్లో పెరిగే మొక్క కలబంద. యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలతో సమృద్ధిగా ఉన్న కలబంద జెల్ దుర్వాసనను తగ్గిస్తుంది. అంతే కాదు బాహుమూలల్లో పెరిగే బ్యాక్టీరియాను చంపుతుంది.
◆ఈ సమస్యకు మరొక చక్కని పరిష్కారం బంగాళదుంప. బాహుమూలల్లోబంగాళాదుంప ముక్కను రుద్దడం వల్ల చెమటను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు మీ చర్మం యొక్క పిహెచ్ స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల వాసన కలిగించే బ్యాక్టీరియా తొలగిపోతుంది.
చివరగా…….
బాహుమూలల్లో చెమట వాసన సమస్యకు పై చెప్పుకున్న చిట్కాలు మాత్రమే కాకుండా శుభ్రత కూడా పాటించాలి. ఇలా చేస్తే సమస్య తొందరగా పరిష్కారమవుతుంది.
Good