చాలా మంది ముఖం, కాళ్ళు, చేతులు వేళ్లపైన, మెడ పైన పులిపిర్లు వస్తూ ఉంటాయి. కొన్ని పులిపిర్లు నొప్పి లేకుండా చర్మంలో కలిసిపోయి ఉంటాయి. కాని కొన్ని పులిపిర్లు నొప్పి, దురద కలిగిస్తాయి. ఈ పులిపిర్లు రావడానికి కారణం ఒక వైరస్. పులిపిర్లు కోసం మనం చాలా రకాల మందులు ఉపయోగిస్తాము. పులిపిర్లు పోగొట్టడంలో ఈ మందులు ఏమి పనిచేయవు. ఈ చిట్కాలను పాటించినట్లైతే నొప్పి లేకుండా పులిపిర్లు రాలిపోతాయి. మొదటి చిట్కా ఏడూ రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని కిచెన్ రోలులో వేసుకొని మెత్తగా దంచుకోవాలి.
దంచిన వెల్లుల్లి పేస్ట్ నుండి వడ కట్టుకుని జ్యూస్ ను తీసుకోవాలి. వెల్లుల్లి జ్యూస్ లో ఉండే ఒక రకమైన ఫంగస్ పులిపిర్లను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ లో అరచెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా పులిపిర్లు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత దీనిలో అరచెంచా నిమ్మరసం వేయాలి. నిమ్మరసం పులిపిర్లు రాలిపోవడానికి సహాయపడుతుంది. ఈ మూడింటిని బాగా కలిపిన తరువాత ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని కట్ చేసి దానితో పులిపిర్లు ఉన్న భాగంలో అప్లై చేయాలి.
ఇలా రోజుకు రెండు సార్లు అప్లై చేయడం వల్ల రెండు,మూడు రోజుల్లో పులిపిర్లు రాలిపోతాయి. రెండవ చిట్కా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక చెంచా సర్ఫ్ వేసుకోవాలి. సర్ఫ్ లేదా బట్టల సబ్బు కూడా పులిపిర్లు పోగొట్టడంలో సహాయపడుతుంది. అర చెంచా బేకింగ్ సోడా, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా వెల్లుల్లి రెబ్బతో పులిపిర్లు ఉన్న భాగంలో అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన రెండు మూడు నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి.
ఇలా రెండు మూడు రోజులు చేయడం వల్ల ఎటువంటి నొప్పి లేకుండా రాలిపోతాయి. కానీ అప్లై చేసినప్పుడు పులిపిర్లు ఉన్న భాగంలో కొంచెం నొప్పి, మంట ఉన్నట్లు అనిపిస్తుంది. పులిపిర్లుతో బాధపడేవారు ఈ రెండిటిలో ఏదో ఒకటి ట్రై చేసి చూడండి. వెంటనే పులిపిర్లు రాలిపోతాయి. ఎటువంటి నొప్పి లేకుండా రెండు మూడు రోజుల్లోనే పులిపిర్లు శాశ్వతంగా రాలిపోతాయి. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పులిపిర్లు సమస్యతో బాధపడే వారు ఒకసారి ఈ రెండింటిలో ఒక చిట్కాను ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి.