how to get rid of white hair simple home remedy

ఇదొక్కటి తాగితే చాలు. తెల్లజుట్టును తగ్గించి జుట్టు పెరుగుదల ఎక్కువవుతుంది

కరివేపాకు మన పూర్వ కాలం నుండి భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ కరివేపాకు  వాసన పడనివారు లేదా దానిని తినడానికి ఇష్టపడని వారు తీసి పక్కన పడేస్తూ ఉంటారు. అలా చేస్తే కరివేపాకు ఇచ్చే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనం చేతులారా తీసి బయట పడేస్తున్నట్టే. జుట్టురాలే సమస్యకు కరివేపాకు చాలా బాగా ఉపశమనం కలిగిస్తుంది. 

కరివేపాకు జుట్టు యొక్క పెరుగుదలకు మరియు మీ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ప్రోటీన్ యొక్క గొప్ప మూలం.  అదనంగా, ఇందులో బీటా కెరోటిన్ మరియు అమైనో ఆమ్లాలు ఉన్నాయి, ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి, నిద్రాణమైన ఫోలికల్స్‌ను పునరుత్పత్తి చేస్తాయి మరియు కొత్త జుట్టును తిరిగి పెంచుతాయి

. దీనిని డైరెక్ట్ గా తీసుకోలేని వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ద్వారా ప్రతి రోజు తీసుకోవడం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి అంతర్గతంగా జుట్టు పెరుగుదలకు, తెల్ల జుట్టు సమస్యకు ఉపశమనం ఇస్తుంది. దాని కోసం మనం ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. అంటే ఐదు రెమ్మల కరివేపాకు తీసుకోవాలి. దీనిని శుభ్రంగా కడిగి వలిచి పక్కన పెట్టుకోవాలి. 

ఒక మిక్సీ జార్లో ఈ కరివేపాకు వేసుకొని, నాలుగు స్పూన్ల పెరుగు వేసుకోవాలి. దీనిలో అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీనిని  మిక్సీ పట్టాలి. వీలైనంత మెత్తని పేస్ట్ లా చేసుకోవడం వలన తాగడం ఈజీగా ఉంటుంది. మిక్సీ పట్టిన తరువాత దీనిని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. దీనిలో అరగ్లాసు నీటిని వేసుకొని కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ కలుపుకోవాలి.

ఇంగువ జీర్ణశక్తికి బంధ సమస్యలను తగ్గించడంలో  చాలా బాగా ఉపయోగపడుతుంది. పసుపు యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ గుణాలతో శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించడంతో పాటు శరీరాన్ని బలంగా తయారు చేస్తుంది. పెరుగు కూడా శరీరంలో  మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చేసి జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది. 

అలాగే జుట్టు పెరుగుదలకు కావల్సిన క్యాల్షియం వంటి పోషకాలను అందిస్తుంది. శరీరంలో ఏ విటమిన్స్, ప్రోటీన్స్ లోపమైనా అది మొదట జుట్టు, చర్మం పై ప్రభావం చూపుతుంది. అందుకే శరీరానికి కావలసిన పోషకాలను ఏ రూపంలోనైనా శరీరానికి అందిస్తూ ఉంటే అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా ఈ డ్రింక్ తాగడంవలన అధికబరువు సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!