How to get thick hair in a month

మందార ఆకులతో పాటు ఈ రెండు ఆకులను కూడా కలిపి నూనె తయారు చేసుకుని వాడినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది

ప్రస్తుతం అందరికి జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. అనేక రకాల కారణాలు ఉండవచ్చు చుండ్రు, జుట్టు   కుదుళ్ళు  బలంగా లేకపోవడం, డ్రై స్కాల్ప్,  చివర్లు చిట్లడం వంటి కారణాల వలన  జుట్టు రాలిపోతుంది. మార్కెట్లో దొరికే రకరకాల  ప్రొడక్ట్స్  ఉపయోగించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈజీగా ఇంట్లోనే ఈ ఆకులతో ఆయిల్  తయారు చేసుకొని వాడినట్లయితే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. దీని కోసం ముందుగా లేత  మందార ఆకులు  శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 

తర్వాత రెండు రెమ్మలు లేత కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు బీటాకెరోటిన్ ను కలిగి ఉంటుంది.  ఇది జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. రెండు రెమ్మలు  లేత వేపాకులు కూడా వేసుకోవాలి. లేత వేప ఆకులు విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉంటాయి.  విటమిన్ సి ఉండటం వల్ల స్కాల్ప్ పై  ఇన్ఫెక్షన్, చుండ్రు   వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.  

దీనిలో ఒక చెంచా  మెంతులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి.  మిక్సీ పట్టేటప్పుడు దీనిలో  నీళ్ళు వేయకూడదు. ఒక స్టీలు గిన్నె కానీ లేదా  ఇనుప కడాయి కానీ తీసుకొని  ఫేస్ట్  వేసుకొని దీనిలో ఒక కప్పు కొబ్బరి   నూనె లేదా  బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్  దేనినైనా ఉపయోగించవచ్చు. నూనె వేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ గ్రీన్ కలర్ లోకి మారేంతవరకు మరిగించుకోవాలి. తడి మొత్తం  ఇంకి  పోయేంతవరకు నూనె మరిగించిన  తర్వాత స్టౌ ఆఫ్ చేసి నూనె చల్లారనివ్వాలి. 

తర్వాత  నూనె  వడకట్టుకొని దీన్ని గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. నూనె  ప్రతిరోజు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. నాలుగు రోజులకు ఒకసారి లేదా ఐదు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే సరిపోతుంది.  బయటికి వెళ్ళాలి ప్రతి రోజు తల స్నానం చేయాలి అనే వారు రాత్రి  అప్లై చేసుకోవాలి. ఉదయం తలస్నానం చేయొచ్చు.  ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గి చుట్టు రాలడం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్, డ్రై స్కాల్ప్, చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.  ఇంక నాకు  జుట్టు పెరగదు అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది. 

Leave a Comment

error: Content is protected !!