How to grow hair faster and thicker naturally

ఈ తైలం రాస్తే ఎంత ఊడిన జుట్టు అయినా సరే ఆగి పెరుగుతుంది

ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం  సంస్థ ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైపోయింది. దీనికోసం మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తాము. వాటిని ఉపయోగించడం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక వెంట్రుక 40 నుంచి 50 కేజీల బరువును తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ  కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ఉపయోగించడం వల్ల చేతితో  పట్టుకొని లాగితే తెగిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితో నాచురల్ పద్ధతిలో జుట్టు రాలడం తగ్గించుకుని జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగే విధంగా చేసుకోవచ్చు.

         దీనికోసం  ఒక ఇనుప కడాయి తీసుకుని దానిలో 100 ఎమ్ ఎల్ కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె  వద్దు అనుకున్న వారు బాదం నూనె లేదా ఆవ నూనె కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో రెండు చెంచాల మందార పౌడర్ వేసుకోవాలి. మందార పువ్వులను ఎండబెట్టి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.మనం ఇంట్లో చేసుకున్న  పొడిని ఉపయోగించాలి లేదా మార్కెట్లో దొరికే  కెమికల్స్ లేని నాచురల్ హైబిస్కస్ పౌడర్  తీసుకోవాలి. ఇది జుట్టు రాలడం తగ్గించి  జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.

          ఒక  వెంట్రుక రాలిన దగ్గర నాలుగు వెంట్రుకలు వచ్చేలాగా చేస్తుంది. తర్వాత దీనిలో రెండు చెంచాల బృంగ్రాజ్ పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా మార్కెట్లో దొరికే నేచురల్ ప్రొడక్ట్స్ ను లేదా మనం నాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ ను ఉపయోగించవచ్చు. ఇది జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి కాకుండా తెల్ల వెంట్రుకలు రాకుండా వచ్చిన వెంట్రుకలు నల్లగా అవడానికి కూడా సహాయపడుతుంది. ఈ మూడు బాగా  ఒక చెంచాతో  కలుపుకోవాలి. 

        ఒకసారి పొయ్యి మీద పెట్టి రెండు నిమిషాల పాటు పైన నురగ వచ్చేంత వరకు మరిగించాలి. లేదా డబల్ బాయిలర్  పద్ధతిలో కూడా వేడి చేసుకోవచ్చు. ఈ నూనె  చల్లార్చుకోవాలి. నూనె చల్లారిన తర్వాత ఏదైనా క్లోత్  సహాయంతో లేదా స్త్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. తర్వాత ఈ నూనె  ఏదైనా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈ నూనెను తలకు రోజు విడిచి రోజు లేదా తలస్నానం చేయడానికి ముందు రోజు నైట్ కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలపాటు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!