How to grow hair faster in a week

ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా జుట్టు పెరగదు అనుకున్నవారు 10 రోజుల్లో జుట్టు పెరిగే లాగా చేసుకోవచ్చు

మధ్య కాలంలో జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల పొడులు ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్  చాలా రకాల  కెమికల్స్ కలిగి ఉంటాయి. ఇవి చాలా  హాని కలిగిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా జుట్టు పెరగదు  అనుకున్న వారు కూడా జుట్టు పెరిగే లాగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం  స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని తర్వాత   2 చెంచాల మెంతులను వేసుకోవాలి. 

        మెంతులు జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడం  సహాయపడతాయి. జుట్టు    మోయిశ్చరైజ్ చేసి, జుట్టు పట్టులాగా మెరవడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత దీనిలో నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కర్వేపాకు జుట్టు రాలడం తగ్గించే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. కరివేపాకు తెల్ల వెంట్రుకలు తగ్గించి నల్ల బడటానికి  చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక కలబంద తీసుకుని శుభ్రంగా కడిగి రెండు వైపులా సైడ్స్  కట్ చేసుకోవాలి. 

        తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలో వేసుకోవాలి. దీని కోసం ప్లాంట్ బేస్ అలోవెరా మాత్రమే తీసుకోవాలి. మార్కెట్లో దొరికే వాటిని ఉపయోగించకూడదు. తర్వాత దీనిలో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకొని బాగా మరగనివ్వాలి. నూనె మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నూనె పెట్టుకుని ఏదైనా కానీ స్టోర్  చేసుకోవాలి. దీన్ని వారానికి ఒక రోజు లేదా   రాసుకోవడానికి ముందు తయారు చేసుకుంటే మంచిది. ఎందుకంటే దీనిలో  అలోవెరా వేసుకుంటాము. 

            కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.  ఈ నూనెను ప్రతిరోజు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా అప్లై చేసుకొని ఒక గంట తర్వాత తలస్నానం చేసే వచ్చు. నూనె  అప్లై చేసినప్పుడు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి మృదువుగా ఐదు నుండి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్  ఉండవు.  ఇంక మాకు జుట్టు పెరగదు అనుకున్న వారు ఒకసారి ఈ నూనెను తయారు చేసుకొని ఉపయోగించండి. మంచి ఫలితం ఉంటుంది. 

Leave a Comment

error: Content is protected !!