ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు రాలడం సమస్యతో చాలా ఎక్కువగా బాధ పడుతున్నారు. దీనిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితో ఈజీ గా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.దీనికోసం ముందుగా మీ జుట్టుకు సరిపడినన్ని మెంతులను తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మెంతులను మిక్సీ జార్లో వేసుకోవాలి మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గించి చుట్టూ ఒత్తుగా పొడవుగా పెరగడం లో సహాయపడతాయి.
చుండ్రు ఇన్ఫెక్షన్ త్వరగా వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. తర్వాత గిన్నెలో కొన్ని జామకాయ శుభ్రంగా కడిగి వేసుకోవాలి జామాకు జుట్టుకు తెల్లని జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతాయి. జామ ఆకుల లో విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ సి విటమిన్ బి 6 పట్టి ఉంటాయి ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి చుట్టూ ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతాయి. జామాకులు జుట్టు కుదుళ్లు బలంగా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఏదైనా స్త్రైనర్ లేదా పల్చటి క్లాత్ సహాయంతో దీన్ని వడకట్టుకోవాలి. దీనిని వడకట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఎక్కువ సమయం పడుతుంది.
వడ కట్టుకోకుండా మీరు తలకు అప్లై చేసుకోవచ్చు. కానీ తలస్నానం చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు లాంటివి జుట్టు లో ఇరుక్కు పోతాయి. అందువలన వడగట్టుకుని ఉపయోగించడం మంచిది. తర్వాత దీంట్లో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ పిండుకోవాలి. వారి కొబ్బరి నూనె లేదా క్యాస్టర్ ఆయిల్ వేసుకోవచ్చు.ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి.అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట ఆరనివ్వాలి. హోమ్ మేడ్ షాంపూ తో తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు పెరగదు అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కా అవసరమనిపిస్తే మీరు ఒకసారి ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది.