how to grow hair faster naturally in a week

100సంవత్సరాల క్రితమే మన జేజేమ్మలు వాడిన ప్యాక్, ఇది రాస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది

పూర్వం మన పెద్దవారు నాచురల్ గా దొరికేవాటితో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగడం కోసం అనేక ప్యాక్స్ ఉపయోగించేవారు.  వాళ్ళు నాచురల్గా దొరికే వాటిని ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా పెరిగేది. ఆ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మందార పువ్వులను మీ జుట్టుకు సరిపడినంత పేస్ట్ వచ్చేలాగా తీసుకోవాలి. మందార పువ్వులు తొడిమలు, కాడలను తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 

     ఈ ప్యాక్ కోసం ఒంటి రేఖ మందారం మాత్రమే తీసుకోవాలి. ఈ పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మీ జుట్టుకు సరిపడినన్ని మందార ఆకులను వేసుకుని ఒక చెంచా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా తీసి పక్కన పెట్టుకున్న బౌల్లో ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి. దీనిలో ఒక చెంచా బాదం ఆయిల్ వేసుకోవాలి.   బాదం ఆయిల్ వద్దు అనుకున్న వారు  క్యాస్టర్ ఆయిల్ లేదా ఆవ నూనె కూడా వేసుకోవచ్చు. 

      మందార పూలు పేస్ట్ చేసి తలకు పెట్టుకోవడం  వలన  జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం లో సహాయపడతాయి. చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద  వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మందార పూలు పేనుకొరుకుడు బట్టతల  వంటి సమస్యలు ఉన్న చోట జుట్టు వచ్చేలా చేస్తాయి. మందార పూలు అప్లై చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. మందార ఆకులు కూడా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడం లో సహాయపడుతాయి  మందార ఆకులు జుట్టు సాఫ్ట్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. 

    బాదం  ఆయిల్ జుట్టు మాయిశ్చరైజ్  చేసి డ్రై అవ్వకుండా చేయడంలో సహాయపడుతుంది. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత హోమ్ మేడ్ షాంపుతో తలస్నానం చేయాలి. మనం ఒకసారి  అప్లై చేసినట్లయితే మూడు  వారాలకు రిసల్ట్ చూపిస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  తెల్ల వెంట్రుకలు రాకుండా చేయడంలో ఈ పాక్  చాలా బాగా పనిచేస్తుంది. దురద, చుండ్రు,  ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా చేయడంలో ఈ  ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లడం,  డామేజ్  హెయిర్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!