మనందరి జీవనశైలిలో పూర్వానికి, ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. దీనివలన జీవితంలో ఆందోళనలు, ఒత్తిడి, అధికం కాలుష్యం, ప్రశాంత వాతావరణం లేకపోవడం వలన చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని అరికట్టడానికి లేదా కవర్ చేయడానికి మనం అనేక రకాల కెమికల్స్ తో ఉన్న ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. వాటి వలన జుట్టు సమస్యలు పెరగడంతోపాటు జుట్టు పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంటుంది. అనేక రకాల చర్మ సమస్యలు, చర్మ క్యాన్సర్ వీటి వలన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందుకే మనం సహజంగా దొరికే పదార్థాలతో కొన్ని జుట్టు సంబంధిత సమస్యలను నివారించే చిట్కాలు తెలుసుకోవాలి. వీటి వలన ఎటువంటి హాని లేకుండా జుట్టు పెరుగుదల ఎక్కువ అవుతుంది మరియు జుట్టు సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. దీని కోసం మనం రెండు బిర్యానీ ఆకులను తీసుకోవాలి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని వేసుకొని బిర్యానీ ఆకులు అందులో వేయాలి. దీనిలో ఏదైనా టీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండూ బాగా మరిగి రంగు నీటికి వచ్చేంతవరకు నీటిని మరిగించాలి. నీళ్ళు రంగు మారిన తరువాత ఆపేసి నీటిని వడకట్టుకోవాలి.
ఈ నీటిని తల స్నానం చేసిన జుట్టుకు స్ప్రే చేయవచ్చు లేదా కాటన్ బాల్తో అప్లై చేసి కనీసం రెండు గంటలు ఉంచుకొని ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు కోసం బిర్యానీ ఆకును ఉపయోగించడం వల్ల చుండ్రుని తొలగించడమే కాకుండా జుట్టును మెరిసేలా చేస్తుంది. కాలుష్యంతో పాటు గాలిలో ఉండే ఫ్రీ రాడికల్స్, జుట్టు పొడిబారి, పెళుసుగా మారతాయి. బిర్యానీ ఆకులోని యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు జరిగిన నష్టాన్ని తిప్పికొట్టడంలో సహాయపడతాయి మరియు మరింత మెరుపుతో మెరిసేలా చేస్తాయి.
టీలోని కెఫిన్ చుండ్రు సమస్యను నివారించి జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరిగేందుకు సహకరిస్తుంది. జుట్టును నల్లగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. టీ లో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టులో ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటాయి. జుట్టు చివర్లు చిట్లి ఉన్నప్పుడు టీ జుట్టును మృదువుగా, జీవంతో ఉండేటట్లు చేసి జుట్టు చిట్లే సమస్యను తగ్గిస్తుంది.
ఇలా వారానికి రెండు సార్లు ఉపయోగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఒకసారి ఉపయోగించి ఫలితం లేదని వదిలేయకుండా కనీసం కొన్ని వారాలపాటు వాడడం వల్ల దాని వలన వచ్చే మార్పులను గమనించవచ్చు. ఎక్కువగా తెల్లజుట్టు ఉన్న వారికి ఎక్కువ సమయం పడితే తక్కువ తెల్ల జుట్టు సమస్య ఉన్నవారికి తక్కువ సమయం పడుతుంది.