How to Grow Long and Thick EYEBROWS

కనుబొమ్మలను ఒత్తుగా పెరిగేలా చేసే అద్భుతమైన చిట్కా

తీరైన ముఖంలో విల్లు వంచినట్టు కనుబొమ్మలు ఆకర్షణ తీస్తాయి. అయితే చాలా మందిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. ఫాషన్ అవ్వచ్చు లేదా ట్రెడిషన్ అవ్వచ్చు ఎలా రెడి అవుతున్న ఐబ్రోస్ పెన్సిల్ తో తమకు ఒత్తుగా లేని కనుబొమ్మలను పెన్సిల్ తో రుద్ధేసి ఒత్తుగా ఉన్నట్టు సృష్టించుకుంటారు. అయితే సహజమైన పద్దతిలో కనుబొమ్మలు సులువుగానే ఒత్తుగా అయ్యేలా పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. అలాంటి ఒక అద్భుతమైన చిట్కా మీకోసం మరి.

అయితే ముందుగా ఒక్క మాట. మనం కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి ఏదైనా చిట్కా ప్రయత్నం చేసినా……. జుట్టు పెరగడానికి చిట్కాలు వాడినా ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు. అదే ఆహారం. 

మనం రోజూ వారి తీసుకునే ఆహారం సమతుల ఆహారం అయి ఉండి మన శరీరానికి కావలసిన పోషకాలను సమృద్ధిగా అందించేలా ఉండాలి. ఇలాంటి ఆహారం తీసుకుంటూ జుట్టు పెరుగుదలకు కానీ కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి కానీ చిట్కాలు పాటిస్తే 100% ఫలితం చాలా తొందరగా రావడం ఖాయం.  కాబట్టి ముందుగా ఆహారం విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి మీకోసం చిట్కా ఇపుడు.

కావలసిన పదార్థాలు

  • వెల్లుల్లి పాయలు : గుప్పెడు
  • కొబ్బరి నూనె : ఒక స్పూన్
  • ఆముదం : ఒక స్పూన్
  • టీట్రీ ఆయిల్ : రెండు లేదా మూడు చుక్కలు.

తయారువిధానం: 

వెల్లుల్లిపాయలు బాగా దంచి రసం తీసుకోవాలి. సుమారు ఇరవై చుక్కల వెల్లుల్లి రసం వచ్చేలా చేయాలి. ఈ వెల్లుల్లి రసంలో స్పూన్ కొబ్బరి నూనె, స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి ఇందులోకే రెండు నుండి మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ వెయ్యాలి. దీన్ని ఒక చిన్న బాటిల్ లో వేసి మిశ్రమం బాగా కలిసేలా షేక్ చేయాలి.

ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ ఆయిల్ ను కనుబొమ్మలకు రాసి మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే కేవలం వారం నుండి పధిరోజుల్లోపు  కనుబొమ్మలు ఒత్తుగా అవడం గమనిస్తారు.

వెల్లుల్లిలో జుట్టు పెరుగుదలకు తోడ్పడే లక్షణాలు ఉంటాయి, కొబ్బరి నూనె రక్షప్రసరణను పెంచుతుంది, ఆముదం వెంట్రుక మందం అవడానికి తోడ్పడుతుంది. ఇక ఇందులో వాడిన టీట్రీ ఆయిల్ వెల్లుల్లి వాసనను అరికట్టడమే కాకుండా, మాశ్చరైజర్ గానూ, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది.

చివరగా……

పైన చెప్పుకున్న సింపుల్ చిట్కా ఒకసారి ఉపయోగించి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు కచ్చితంగా. మరింకెందుకు ఆలస్యం తీరైన, ఒత్తైన కనుబొమ్మలు మీ సొంతం చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!