How To Grow Long and Thicken Hair Naturally and Faster

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఈ హెయిర్ టానిక్ ట్రై చేసి చూడండి

ఈ మధ్యకాలంలో జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం ఆయిల్స్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. కానీ వాటిలో అనేక రకాల కెమికల్స్ ఉండటం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మన వంట గదిలో ఉండే వాటితోనే ఈ హెయిర్ టానిక్ తయారు చేసుకొని ఒక పది రోజులు ఉపయోగించినట్లయితే జుట్టు రాలడం ఈజీగా తగ్గించుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం రెండు చెంచాల మెంతులను తీసుకోవాలి. మెంతులు  జుట్టు పొడి బారకుండా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టుకు అవసరం అయినా పోషకాలు లభిస్తాయి.

      జుట్టుకు మాయిశ్చరైజేషన్ కూడా అందిస్తాయి. తర్వాత రెండు చెంచాల బియ్యం తీసుకోవాలి. బియ్యం పాలిష్ చేయనివి అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. బియ్యం నానబెట్టిన నీళ్లను ఉపయోగించడం వలన జుట్టు రాలడం ఈజీగా తగ్గించుకోవచ్చు. బియ్యం కడిగిన నీటిలో ఉండే పోషకాలు జుట్టుకు చాలా బాగా సహాయపడతాయి. తర్వాత రెండు చెంచాల లవంగాలను తీసుకోవాలి. లవంగాలు జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడతాయి. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి. 

     దానిలో మనం ముందుగా తీసుకున్న మెంతులు, బియ్యం ,లవంగాలను వేసుకోవాలి . గ్లాస్ నీళ్లు అర గ్లాసు అయ్యేంతవరకు మరిగించుకోవాలి. నీళ్ళు మరిగేసరికి లైట్ గా పసుపు రంగులోకి మారుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటిని వడగట్టుకుని చల్లార్చుకోవాలి . చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు జుట్టుకి అప్లై చేయకూడదు. వేడిగా ఉన్నప్పుడు అప్లై చేయడం వలన జుట్టు డామేజ్ అవుతుంది. ఈ వాటర్ జుట్టుకు హెయిర్ టానిక్ లాగా ఉపయోగించుకోవచ్చు. 

     ఈ వాటర్ ను ప్రతిరోజు జుట్టుకు స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసిన తర్వాత పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా వరుసగా పది రోజులు చేయడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మాకు ఏమి చేసిన జుట్టు పెరగట్లేదు అనుకునేవారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి .జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

     దీనిలో ఎటువంటి కెమికల్స్ లేవు. కాబట్టి ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు. జుట్టు బాగా ఊడిపోయి పల్చగా అయిపోయిన వారు కూడా ఉపయోగించడం వలన ఊడిపోయిన ప్రతి వెంట్రుక తిరిగి వస్తుంది.ఈ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేయకూడదు. ఏదైనా మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి.

Leave a Comment

error: Content is protected !!