How to Grow Long Hair Get Thick and Black Hair

ఊడిన జుట్టు తక్కువ టైం లో మళ్ళీ రావాలంటే ఇలా చేయండి

అలోవెరా జెల్ ఉపయోగించడం కంటే లిక్విడ్ రూపంలో ఉపయోగించడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని సైంటిఫిక్ గా నిరూపించబడినది. ఈ విషయాన్ని 2009 వ సంవత్సరం అలాహాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇండియాలోనే అలోవెరా మీద పరిశోధనలు చేసి నిరూపించింది. జుట్టురాలడం సమస్య ఎక్కువగా ఉన్నవారు అలోవెరా జెల్ కాకుండా జ్యూస్ చేసి అప్లై చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. అలోవెరా జెల్ తీసుకుని నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటే అది లిక్విడ్ లాగా అవుతుంది. 

     జెల్ అప్లై చేస్తే అది స్కాల్ప్ మీదనే ఉండిపోతుంది. జెల్ లాగా ఉండటం వలన కుదుళ్ళు లోపలికి వెళ్ళదు. కానీ అలోవెరా అలోవెరా జ్యూస్ చేసి అప్లై చేయడం వలన అది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి కుదుళ్ళు లోపలి వరకు వెళ్లి జుట్టుని కుదుళ్ళ నుండి బలంగా చేస్తుంది. లిక్విడ్ అలోవెరా అప్లై చేయడం వలన విటమిన్ B12 ఉంటుంది. 100గ్రాముల అలోవెరా లిక్విడ్ లో 10.9 మైక్రో గ్రామ్స్ విటమిన్ B12 ఉంటుంది.శరీరంలో విటమిన్ B12 లోపం ఉండటం వలన జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

            అలోవెరా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ సి మరియు విటమిన్ డి కలిగి ఉంటుంది.ఇవి జుట్టు ఊడిన వెంటనే కొత్త వెంట్రుకలు రావడానికి బాగా ఉపయోగపడతాయి. స్కాల్ప్ పైన జుట్టు కుదుళ్ళలో ఆయిల్స్ రిలీస్ చేసే కణజాలం ఉంటుంది. ఇది స్కాల్ప్ మరియు హెయిర్ డ్రై అవ్వకుండా ఉండేలా చేస్తుంది. ఈ కణజాలం ఆయిల్స్ రిలీజ్ చేయకపోవడం వలన స్కాల్ప్ డ్రై అయిపోయి చుండ్రు వస్తుంది. ఈ అలోవెరా జ్యూస్ అప్లై చేసినట్లయితే ఆయిల్స్ అవసరమైన మోతాదులో రిలీజ్ అయ్యి చుండ్రు సమస్య తగ్గుతుంది. 

           అలొవెరా లిక్విడ్  అప్లై చేయడం వల్ల ఒక వెంట్రుక ఊడిన దగ్గర నుండి వెంట్రుకలు రావడానికి 20 రోజులు సమయం పడుతుంది. అలొవెరా లిక్విడ్ అప్లై చేస్తే  వెంటనే వెంట్రుకలు వస్తాయి. అందుకే ఇక నుండి అలోవెరా జెల్ కాకుండా అలోవెరా జ్యూస్ అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  అలోవెరా జెల్ కంటే అలోవెరా లిక్విడ్ జుట్టు రాలడం తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్ల వరకు ఇంకి కొత్త వెంట్రుకలు త్వరగా రావడంలో సహాయపడుతుంది. ఈసారి మీరు కూడా అలోవెరా జెల్ కాకుండా అలోవేరా లిక్విడ్ ను ఉపయోగించండి. ఇది జుట్టు రాలడం,చుండ్రు  తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!