ఆడవారికి అందంగా రెడీ అవ్వాలని చాలా ఆశపడతారు. అలాగే చేతికి గోర్లు పెంచుకోవడం, రంగురంగుల నైల్ పోలిష్ వేసుకోవడం, నెయిల్ ఆర్ట్స్ చేయించుకోవడం కూడా చాలా ఎక్కువగా చేస్తారు. కొంతమంది గోర్లు పెరగటం లేదని వచ్చిన బోర్లు విరిగిపోతున్నాయని ఆర్టిఫిషియల్ గోర్లను పెట్టించుకోవడం, గోర్లు ఎక్స్టెన్షన్ చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ సమయంలో గోర్లను ఈజీగా పెరిగేలాగా చేసుకోవచ్చు.
ఈ చిట్కాని ట్రై చేస్తున్నట్లయితే మీకు గోర్లు ఆస్తమాను విరిగిపోకుండా చాలా అందంగా, బలంగా తయారవుతాయి. దీనికోసం ముందుగా ఒక టబ్ తీసుకొని దాంట్లో చేతులు మునిగేంత వరకు గోరువెచ్చని నీళ్లను వేసుకోవాలి. తర్వాత దీనిలో నిమ్మరసం వేసి రెండు చేతులను ఆ నీళ్లలో 20 నిమిషాల పాటు ఉండనివ్వాలి. తర్వాత రసం పిండిలో నిమ్మ చెక్కతో గొర్లపై ఒకసారి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోర్లపై పేరుకుపోయిన దుమ్ము పోయి చాలా నీట్ గా ఉంటాయి. అలాగే విటమిన్ సి గోర్లలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి గోర్లు బలంగా పెరగడంలో సహాయపడుతుంది.
తర్వాత పొడి క్లాత్ తో చేతులను తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల గోర్లు బలంగా తయారవుతాయి. తర్వాత గోర్లు పసుపు పచ్చగా మారడం క్లియర్ గా లేకపోవడం జరుగుతుంది. అలా ఉండటం వల్ల గోర్లు చూడడానికి చాలా చిరాగ్గా కనిపిస్తాయి. పచ్చదనం పోగొట్టుకోవడానికి ఒక వాడిన బ్రష్ ని తీసుకుని దాని మీద కొంచెం పేస్ట్, కొంచెం పంచదార పొడి వేసి గోళ్ళని రెండు నిమిషాల పాటు బ్రష్ తో రుద్దాలి. ఇలా చేయడం వల్ల గోర్లపై ఉండే పసుపు పచ్చ రంగు పోయి గోర్లు తెల్లగా అందంగా కనిపిస్తాయి.
గోర్లు పెరగడం కోసం ఈ ఆయిల్ని తయారు చేసుకొని ఉపయోగించినట్లయితే మూడు రోజులలో గోర్లు విపరీతంగా పెరుగుతాయి. దీనికోసం వెల్లుల్లి రెబ్బలని తీసుకొని పై పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను గాజు సీసాలో వేసి దానిలో నాలుగు లేదా ఐదు చెంచాలు కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనెను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేసి పడుకోవడం వలన మూడు రోజులలో గోర్లు విపరీతంగా పెరుగుతాయి. ఇంక నాకు గోర్లు పెరుగు అనుకున్న వారు కూడా ఈ చిట్కా ఫ్రై చేసినట్లయితే గోర్లు విపరీతంగా పెరుగుతాయి.