How to Grow Taller by Dr Manthena Satyanarayana Raju

పొట్టిగా ఉన్నవారు పొడుగు పెరగచ్చా?? పొడవు పెరగడానికి మార్కెట్ లో దొరికే మందులు, పరికరాల విషయంలో విస్తుపోయే నిజాలు!!

పొడుగు ఎదగాలని చాలామంది కోరుకొంటారు. ముఖ్యంగా చదువుకొనే అమ్మాయిలు, అబ్బాయిలకు లావు కావాలని అన్పించదు గానీ బాగా పొడుగ్గా వుంటే బావుంటుందని ఎంతగానో ఆశిస్తారు. అలా పొడుగు కావాలని కోరుకునే వారు ఇవి తప్పక చదవాల్సిందే!!

◆ ఒక వ్యక్తి పొడుగరి అవుతాడా… పొట్టిగా వుంటాడా అనే నిర్ణయం ఆ వ్యక్తి తల్లి కడుపులో పడ్డప్పుడే జరిగిపోతుంది.

◆ పోషక ఆహారం, వ్యాయామం అనేవి ఆ వ్యక్తికి సహజంగా రావలసిన పొడుగు కన్నా ఒకింతగా కొద్దిగా పెరిగేందుకు మాత్రమే దోహదపడ్డాయిగానీ, పొట్టివాళ్ళు పొడుగ్గా మారేందుకు మాత్రం కాదు.

◆ హార్మోన్ చికిత్సా విధానం ద్వారా కొంత వరకూ పొట్టి వాళ్ళను పొడుగు ఎదిగేలా చేయవచ్చుగానీ, దానివలన కలిగే సైడ్ ఎఫెక్ట్ లు ఎక్కువ.. 

◆ పొరుగవడం అనేది జెనెటికల్గా వంశపారంపర్యంగా నిర్ణయించబడ్తుంది. తల్లిదండ్రుల పోలికే కావాలని లేదు తాతముత్తాతలు మేనత్తలు, మేనమామలు, పిన్ని బాబాయిలూ వీరందరి పోలికలు కూడా అంతో ఇంతో పుట్టబోయే పిల్లల మీద ఉంటాయి. పొడుగు కావడంగానీ, పొట్టిగా మిగిలిపోవడంగానీ అందులో ఒకటి!

◆ తల్లిదండ్రులకు పుట్టిన నలుగురు పిల్లల్లో ముగ్గురు పొడవుగానూ ఒకరు పొట్టిగానూ పుట్టవచ్చు. నలుగురూ నాలుగు ఎత్తుల్లో పుట్టినా ఆశ్చర్యం ఏమీ లేదు.

◆ 5 నుంచి 6 అడుగుల ఎత్తులో మన సగటు భారతీయులుంటారు. 18 సంవత్సరాలు నుంచి 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి పొడవు ఎదగడం ఆగిపోతుంది. 16 ఏళ్ళు దాటితే పొడవు ఎదగడం అనేది ఉండకపోవచ్చు. 

◆ ఈలోగానే పూర్తిగా ఎంతవరకూ పొడవు ఎదిగేందుకు అవకాశం వుంటుందో అంత వరకూ పెరిగేందుకు వ్యాయామాలు చేస్తే కొంతవరకూ ప్రయోజనం వుంటుంది. కానీ, అలా వుంటుదను హామీ ఏమీ లేదు.

◆ శరీరంలో పెరుగుదలని నియంత్రించి హార్మోన్లు ఉంటాయి. థైరాయిడ్, సెక్స్ హార్మోన్లు కూడా పొడుగు విషయంలో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. ఆయా హార్మోన్లు ఎంతెంత  వున్నాయో అంచనా వేసి, ఏ హార్మోను తక్కువగా వుంటే దాన్ని ఉత్పత్తి అయ్యేలా చేసి తద్వారా పొడుగు పెరిగేలా చేయవచ్చు. ఇదంతా కూడా ఎండ్రోకయినాలజిస్టుల్ని సంప్రదించి సలహా పొందవలసిన విషయం! ఏమైనా 1 నుంచి 4 అంగుళాలకు మించి పొడుగు వచ్చే అవకాశం మాత్రం ఉండదు.

◆ ఎముకల్ని సాగదీసే శస్త్రచికిత్సా పద్ధతి ఒకటుంది. ఎముకల్లో వంకరవచ్చి, దొడ్డికాళ్ళున్నవారికి ఆ వంకరని సరిచేయడం కోసం ఇలాంటి ఆపరేషన్ చేస్తారు. కాలిలో ఎముకల్ని మధ్యకు కత్తిరించి ఆరు లేక ఏడు అంగుళాలు దూరంగా జరిపి మధ్య గ్యాస్లో ఎముక పదార్థం పెరిగేలా చేస్తారు. ఆ పెరిగినంత మేర మాంసకండరం, నరాలు రక్తనాళాలు అన్నీ పెదగాలి కదా… ఇదంతా రిస్క్ కూడుకున్న ఆపరేషన్, పైగా పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

◆వ్యాయామం చేసే స్ప్రింగ్లు వగైరా తయారు చేసే కంపెనీలు పొడుగు పెరుగుతారంటూ ప్రకటనలు గుప్పిస్తుంటారు. ఇదంతా పచ్చి మోసం. ఎంత కష్టపడి న్యాయామం చేసినా పొడుగు పెరిగే అవకాశం వున్నంత మేర మాత్రమే పెరగుతారుగానీ, పొట్టివాడు పొడుగై పోయేది మాత్రం అభూతకల్పన ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోకండి. 

చివరగా…..

టానిక్కులూ, కేల్షియం మాత్రలూ, ఇతర విటమిన్లు ఇవన్నీ వ్యక్తులు తమ సహజమైన పొడవుని పొందడానికి ఉపయోగపడ్డాయే గాని అమాంతం ఆజాను బాహులుగా  మార్చేందుకు కాదని వైద్యశాస్త్రం చెస్తోంది. ఇవన్నీ చదివాక కూడా పొడవు పెరుగుతారని వాణిజ్య సంస్థలు ఇచ్చే ప్రకటనలు నమ్ముతారా?? మీరే ఆలోచించుకోండి.

Leave a Comment

error: Content is protected !!