how to grow your hair faster woman

వారానికి నాలుగు సార్లు అంతే జుట్టు పెరగడానికి ఇంతకంటే మంచి చిట్కా ఎక్కడ దొరకదు, మీ జుట్టు చూసి అందరూ ఆశ్చర్యపోతారు

ప్రస్తుతం  జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. వాతావరణం కాలుష్యం,  ఆహారములో సరైన పోషకాలు  లేకపోవడం కూడా దీనికి ప్రధానమైన కారణం. ఈ సమస్యను  తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మనం వీటిని ఉపయోగించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కెమికల్స్ లేకుండా నాచురల్ పద్ధతిలో జుట్టు  రాలడం తగ్గించుకొని జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగే లాగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దానిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 

     నాలుగు లేదా ఐదు కరివేపాకును శుభ్రంగా కడిగి  వెనిగర్ కలిపిన నీటిలో వేసి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ నీటిని  స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకుని వెళ్లి  తలస్నానం అయిపోయిన తర్వాత ఈ నీటిని తలపై నుండి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడంతగ్గుతుంది. ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ   చిట్కా వారంలో రెండుసార్లు ట్రై చేసినట్లయితే మీ జుట్టు రాలడం సమస్య  ఈజీగా తగ్గించుకోవచ్చు. 

       రెండవ చిట్కా ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల బియ్యం తీసుకోవాలి. దానిలో రెండు చెంచాల మెంతులు వేసుకొని నీళ్లు వేసి మూడు గంటలపాటు నాననివ్వాలి. మూడు గంటల పాటు  నానిన తర్వాత పై నీటిని వడగట్టుకొని  ఏదైనా స్ప్రే బాటిల్ లో వేసుకొని జుట్టు మొత్తం  స్ప్రే చేసుకోవాలి. అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా హోం మేడ్ షాంపూ తో తలస్నానం చేసినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. 

         ఈ చిట్కా వారంలో రెండుసార్లు చేసినట్లయితే నెల తిరిగే సరికి జుట్టు రాలడం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ  చిట్కాలు ట్రై చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఇవి నేచురల్గా  జుట్టు పెరగడంలో సహాయపడతాయి. ఈ చిట్కాలు ట్రై చేసిన తర్వాత మీ జుట్టును చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఈ రెండు చిట్కాలు జుట్టు రాలడం సమస్యను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

Leave a Comment

error: Content is protected !!