నిజానికి హార్మోన్స్ గురించి చాలా మందికి సరిగా తెలియదు. ఈ హార్మోన్స్ అనేవి అతి తక్కువ మోతాదులో విడుదలవుతాయి శరీరానంతటిని కంట్రోల్ చేస్తాయి. హార్మోన్స్ అనేవి తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వడమే కాకుండా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. హార్మోన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ అనే రెండు రకాల హార్మోన్స్ ఉంటాయి. ఎండోక్రైన్ హార్మోన్స్ అంటే డైరెక్ట్ గా రక్తంలోకి విడుదలవుతాయి. ఎక్సోక్రైన్ హార్మోన్స్ అంటే పేగుల్లోకి వదలబడతాయి. ఆహారంతో పాటు వెళ్లిపోతాయి. మన శరీరంలో మెటబాలిజం అంతటిని ఈ హార్మోన్స్ నడిపిస్తాయి. కొన్ని రకాల హార్మోన్స్ సెక్స్వాల్ యాక్టివిటీకి ఉపయోగపడుతుంటాయి.
దాని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని రకాల హార్మోన్స్ మానసిక స్థితిని ఆనందంగా ఉంచడానికి ఉపయోగపడితే, కొన్ని దుఃఖంలోకి, స్ట్రెస్ లోకి వెళ్లేటట్టు ఉపయోగపడతాయి. కొన్ని రకాల హార్మోన్స్ గుండె యెక్క యాక్టివిటీని పెంచడానికి, తగ్గించడానికి ఉపయోగపడతాయి. కొన్ని రకాల హార్మోన్స్ బాడీ డీ టాక్సిఫికేషన్ కి ఉపయోగపడతాయి. కొన్ని రకాల హార్మోన్స్ నిద్రపోవడానికి ఉపయోగపడతాయి. ఇన్ని రకాలుగా మేలు చేసే హార్మోన్స్ శరీరంలో సరిగా ఉత్పత్తి అవ్వాలంటే మన ఆలోచనలు బట్టి, ఫిజికల్ యాక్టివిటీ ని బట్టి, మనం తీసుకునే డైట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ హార్మోన్ అనేది గ్రంధులు నుండి ఉత్పత్తి అవుతాయి.
ఇవన్నీ సమతుల్యంగా ఉత్పత్తి అయితేనే మన ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ తప్పితే మన శరీరంలో సమస్యలు అనేవి తలెత్తి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మన ఆహార నియమాలు, జీవన శైలిలో వచ్చే మార్పులు కూడా ఈ హార్మోన్స్ పై ప్రభావం చూపిస్తాయి. హార్మోన్స్ కనుక దెబ్బతింటే ఎన్నో రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వకపోతే శుక్రకణాలు ఉత్పత్తి తగ్గిపోవడం సంతానలేమి వంటి సమస్యలకు గురవుతారు. ఈస్ట్రోజన్ తక్కువ రిలీజ్ అయితే PCOD, సంతానలేమి వంటి సమస్యలకు లోనవుతారు.
హార్మోనల్ హెల్త్ బాగుండాలి అంటే మంచి ఆహారం సమతుల్యమైన ఆహారం పోషకాలు ఎక్కువ ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఒత్తిడిని కూడా బాగా తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్సింగ్ గా ఉంటాయి. ఈ విధంగా హార్మోన్స్ అనేవి మన జీవనశైలిలో ముఖ్యమైన పాత్రను వహిస్తున్నాయి.