ఇప్పటి కాలంలో బిజీ లైఫ్ పూర్తిగా ఫోన్లో, లాప్టాప్తో గడిపే సమయంలో కంటి చూపు అనేది చాలా తగ్గిపోతుంది. చిన్న చిన్న పిల్లల్లో కూడా కళ్ళు మసకబారడం, వస్తువులు కనిపించకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. చిన్నప్పటినుండి వాళ్లకు కొన్ని అలవాట్లు చేయడం వలన ఎదిగే కొద్దీ కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తోటకూర , మునగాకు వంటి ఆకుకూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం పూట విటమిన్ A ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
కొత్తిమీర లో కూడా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. వీటిని పచ్చడిగానో,చట్నీలుగానైనా ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ ఎ శరీరంలో చేరుతుంది. శాకాహారం కూరలైన బేటా కెరోటిన్ క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది. రోజూ రెండు క్యారెట్లు, రెండు టమాటాలు, ఒక కీరా, సగం బీట్రూట్ తీసుకొని ముక్కలుగా తరగాలి. అందులో క్యారెట్, బీట్రూట్ ముక్కలు కూడా కలపాలి. ఇందులో ఉండే జ్యూస్ను వడకట్టి తాగడం వలన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. తాగగలిగితే పుదీనా, కొత్తిమీర, కరివేపాకులాంటి ఆకుకూరలు కూడా కలిపి మిక్సీ పట్టి తాగవచ్చు.
ఈ జ్యూస్ ను పెద్దవాళ్లు 250 ml 300 వరకు, పిల్లలు 200 ml వరకు తాగవచ్చు. పిల్లలకు ఉదయాన్నే పాలకు బదులు మొదటి ఆహారంగా ఇది ఇవ్వడం మంచిది. దీని వలన కంటి చూపు మెరుగవుతుంది దాంతోపాటు బ్లడ్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఒక సారి సాయంత్రం ఐదున్నర గంటలకు ఒకసారి, రోజుకు రెండుసార్లు తాగడం వలన మధ్యాహ్నం ఏదైనా తినడం వలన కంటికి చాలా మంచిది. రోజుకు కనీసం 8 గంటలు అయినా నిద్ర అవసరం. కంటికి సరిపడా నిద్ర పోవడం వలన కంటికి మంచిది.
ఎంతలేదన్నా 7, 8 గంటలైనా నిద్ర ఉండాలి. అలాగే ఆహారంలో సాల్ట్ తగ్గించడం వలన కూడా కంటిచూపును కాపాడుకోవచ్చు. సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది కంటికి వెళ్ళే చిన్న రక్తనాళాలను గట్టిపడేలా చేస్తుంది. అందుకే ఆహారంలో వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వీలైతే డిన్నర్ లో పండ్లు మాత్రమే తీసుకోవడం అలవాటు చేసుకుంటే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా సహజమైన అలవాట్లు కంటి చూపును మెరుగు పరిచేందుకు ఆహారాన్ని కాపాడేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి.