ప్రస్తుత కాలం అంతా వేగం వేగం. ఈ వేగానికి కంప్యూటర్లు, స్మార్ట్ మొబైల్స్ మొదలైనవి ఇంకా వేగాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఆలోచనలు, అందివస్తున్న సౌకర్యాలు అన్ని కలిపి మనిషిని బిజీ గా తయారుచేస్తున్నాయ్. కేవలం ఈ బిజీ నే కాదు బోలెడు అనారోగ్యం కూడా తెచ్చిపెడుతున్నాయ్. పదేళ్లు కూడా నిండని బుడ్డోళ్ల నుండి ప్రతి 10 మందిలో 6 లేక 7 మంది కళ్ళద్దాలు వాడుతున్నారంటే ఈ సమస్య ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు వయసు, వృద్ధాప్యం రీత్యా అయిదు పదులు దాటిన వారి కళ్ళజోడు ను ఆశ్రయించేవారు ఇపుడు యువతలోనూ, పిల్లల్లోనూ కళ్ళద్దాల వాడకం ఎక్కువగా ఉంటోంది. డిజైన్లు డిజైన్లు కళ్ళజోడుల ఫ్రెములు పెట్టి క్యాష్ చేసుకోవడమే కానీ కంటి చూపు మెరుగు పర్చుకోండని చెప్పే నాథుడు లేడు. అందుకే మన కంటి ఆరోగ్యం గూర్చి మనమే అవగాహన తెచ్చుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే చెప్పబోయేవి తింటే కళ్ళజోడు అవసరమే లేదు. మరి అదేంటో చూద్దాం రండి.
ఎర్రెర్రని దుంప తియ్యతియ్యని దుంప కాసింత ఖరీదు అనిపించినా కొండంత ఆరోగ్యాన్ని కంటికి ప్రసాదిస్తుంది. అర్థమైందా…… క్యారెట్ అండి బాబు క్యారెట్. పచ్చిగా తిన్నా, ఉడికించి తిన్నా దీని రుచి అందరికి తెలిసినదే. హల్వా చేశారంటే వహ్వా అనాల్సిందే, చాట్ లో చేరిస్తే అదనపు రుచితో అధిరిపోవాల్సిందే. సాంబార్ లు, వెజిటబుల్ రైస్ లు, మిక్స్డ్ వెజ్ కర్రీలు అన్నిటిలో క్యారెట్ కింగ్ లెవల్ లో ఉంటుంది. సలాడ్ల రూపం లో తీసుకుంటే సల్సా చేసేట్టు తేలికగా ఉండేలా శరీరాన్ని యవ్వనంగా మార్చేస్తుంది. మరి ఈ క్యారెట్ ను ఉదయాన్నే తీసుకోవడం వల్ల జరిగే ఈ మ్యాజిక్ మరియు క్యారెట్ ను ఎలా తీసుకోవాలి అనేది తెల్సుకుందాం.
◆ముఖ్యంగా క్యారెట్లో 12 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. ఈ 12 కూడా మన కంటి రెటినాలో ఉండే 12 పొరలను కాపాడటంలో గొప్పగా పని చేస్తాయి. విటమిన్-ఎ, బీటాకేరోటిన్ లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యారెట్ లో ఇవి పుష్కలంగా ఉన్నాయి.
◆తాజాగా ఉన్న క్యారెట్ లలో పోషకాలు కూడా తాజాగా ఉంటాయి. ప్రతి రోజు ఉదయం రెండు క్యారెట్ లను పచ్చిగానే పరగడుపున తినాలి. ఇలా తినడం వల్ల క్యారెట్ లోని విటమిన్ ఎ కళ్ళకు మంచి చేస్తుంది. అంతేకాదు క్యారెట్ లోని ఫైబర్ జీర్ణశయానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
◆చిన్న పిల్లలు పచ్చి క్యారెట్ తినాలంటే మొహం చాటేస్తారు. వీళ్లకు క్యారెట్ ను కళాత్మకంగా అందించడం మంచి ప్రత్యామ్నాయం. రకరకాల ఆకారాలుగా కట్ చేసి కనీసం ఉదయాన్నే ఒక క్యారెట్ అయినా తినిపించగలిగితే పేరెంట్స్ పెద్ద విజయం సాదించినట్టే.

◆ఫైబర్ పోతే పోయింది అనుకునేవాళ్ళు క్యారెట్ ను జ్యూస్ చేసి తాజాగా తీసుకోవాలి. దీనివల్ల జ్యూస్ తొందరగా రక్తంలో చేరి విటమిన్ ఎ ప్రభావాన్ని శరీరమంతటా విస్తరింపజేస్తుంది.
◆కంటి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడటంలో క్యారెట్ సమర్థవంతంగా పనిచేస్తుంది.అందుకే ఉదయాన్నే క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి.
◆క్యారెట్ ను పచ్చిగా తినడం లో ఇబ్బంది పడేవారికి మరొక ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదే సలాడ్ గా తీసుకోవడం. క్యారెట్, కీరా ముక్కలకు కాసింత నిమ్మరసం పిండుకుని తీసుకోవడం వల్ల తినబుద్దెయడంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.
చివరగా…..
కంటి ఆరోగ్యాన్ని పెంచే ఆహారపదార్థాలు చాలా ఉన్నప్పటికీ విటమిన్ ఎ సమృద్ధిగా దొరికే ఈ క్యారెట్ ను తీసుకోవడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు క్యా… రేట్ అనుకోకుండా క్యారెట్ ను కొని ఉదయాన్నే తినేయండి.