How to Improve Eyesight Strong Bones

అరుదైన ఆకు దొరికితే వాడకుండా ఉండకండి…… కంటి చూపు పెరుగుతుంది.. బరువు తగ్గుతారు…. ఫ్యాటీ లివర్ సమస్య ఉండదు…….

ప్రస్తుత కాలంలో విదేశీ కూరగాయలు కూడా మనకు లభిస్తూ వస్తున్నాయి. అదే విధంగా ఈమధ్య కాలే ఆకు కూడా బాగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది కూడా పెద్ద పెద్ద ఫుడ్ స్టాల్స్ లో బాగా ఎక్కువగా లభిస్తుంది. దీన్ని కూడా ఆకుకూర లాగా వండుకోవచ్చు. ఈ కాలే ఆకులు 100 గ్రాములు తీసుకుంటే సుమారుగా 50 రూపాయలు పడుతుంది. ఇది పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే లభిస్తుంది. దీనిలో ఏ పోషకాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రా కాలే ఆకులలో 50 క్యాలరీల శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 10 గ్రాములు ఉంటాయి.

ప్రోటీన్ 3.3 గ్రామ్స్, ఫ్యాట్ 0.7గ్రా, ఫైబర్ 2గ్రా ఇవన్నీ స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు అయినా పొటాషియం 447మి.గ్రా, సోడియం 43మి.గ్రా, కాల్షియం 135 మి‌‌.గ్రా, విటమిన్ ఏ 2,870 మైక్రో గ్రామ్స్, విటమిన్ సి 94 మి.గ్రా., విటమిన్ కే 390 మైక్రోగ్రామ్స్, ఇవన్నీ వీటిలో పుష్కలంగా లభిస్తున్నాయి. దీనిని తినడం వలన మనకు ఏమేం ప్రయోజనాలు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. కాలే ఆకులను సహజంగా కొత్తిమీర లాగా పైన చల్లుకోని ఉపయోగించవచ్చు. సలాడ్స్ లో జ్యూస్ లలో వాడుకోవచ్చు.

2006 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్ అమెరికా వారు స్పెషల్గా దీనిపై పరిశోధన చేశారు. దీనిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని కణజలం లోపల డీఎన్ఏ డ్యామేజ్ కాకుండా రక్షించడానికి, క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చెందకుండా నిర్మూలించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది. అంతేకాకుండా దీర్ఘ రోగాలు అయిన ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రాకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది. దీనితోపాటు ముఖ్యంగా చూస్తే ఇందులో ఉండే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.

అందువలన కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రక్తం ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆస్ట్రియోఫోరసిస్ రాకుండా ఇది బాగా రక్షిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి, మరి ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఈ కాలేలో బైల్ యాసిడ్ సీక్వెన్ టెడ్ అనే కెమికల్ ఉండడం వలన మనం తిన్న ఆహారంలో ఉన్న కోవ్వులు రక్తంలోకి, లివర్ లోకి వెళ్లకుండా నిర్మూలించడానికి, పేగుల నుంచి తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తద్వారా ఫ్యాటీ లీవర్స్ కాకుండా ఉండడానికి సహాయపడుతుంది…..

Leave a Comment

error: Content is protected !!