ఆత్మీయులు అందరికీ నేను ఇవ్వాళ చక్కని టిప్ ను ఇవ్వబోతున్నాను. అది ఏంటంటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, జలుబు , వాసనను కోల్పోవడం, దగ్గురావడం ఇటువంటి సమస్యలు దూరం కావడానికి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ నీ తయారు చేద్దాం
ప్రస్తుత కాలంలో, వైరస్ గాలి ద్వారా కూడా మన ముక్కులోకి వెళ్లి అది అక్కడ నుండి మన గాలి తిత్తులలోనికి వెళ్లి అక్కడ అది చుట్టూ ఉన్న కణాలను ఆక్రమించి రక్తం లోనికి ఆక్సిజెన్ ను పంపకుండా ఆపేస్తుంది. దీనితో మనకు ఊపిరితీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది.దానితో పాటు దగ్గు,జలుబు, ఛాతిలో నొప్పిరావడం ,ఆకలి మందంగించడం జరుగుతుంది. దీనితో వైరస్ సులభంగా గాలితిత్తులలోనికి వెళ్లి తరువాత ఇతర భాగాలకు వెళుతుంది. మనశరీరంలోని రక్షణ వ్యవస్థ కంటే ఈ వైరస్ బలవంతంగా తయారవుతుంది. దీనివలన ఆయాసం ఎక్కువ కావడం మన శరీరంలో ఆక్సిజన్ తగ్గడం జరుగుతుంది.
కావున ఈ సింపుల్ చిట్కాలు పాటించడంవలన మీరు గాలితిత్తులను కాపాడుకోవచ్చు.
దీనికి కావలసినది తేనె, మరియు నీరు ఒక్క గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక్క చెంచా తేనె కలుపుకుని కాళి కడుపుతో దీనిని తాగడం మరియు రాత్రి పడుకోబోయేముందు ఒక్క గ్లాస్ తాగడం వలన దీనిని నివారించవచ్చు.
వీటిని సేవిస్తూ లంకనం చేయాలి. లంకనం అంటే అని మీకు అర్థం కాకపోవచ్చు. వారాంతంలో ఒక్కసారి అయినా ఉపవాసం ఉండడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. కాస్త జలుబు చేసినా, లేదా శ్వాస ఇబ్బందిగా ఉన్నా ఇలా చెయ్యడం వలన ఎంతో ఉపశమనం కలుగుతుంది అనడంలో అతిశయోక్తి కాదు.
దీనిని ముందస్తు జాగ్రత్తల కోసం వాడవచ్చు. దీనిని పెద్దలే కాక పిల్లల్లకు సైతం దీనిని అలవాటు చెయ్యడం ఎంతగానో మంచిది. దీని వలన పిల్లల్లో ఏటువంటి సమస్యలు కలగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. దీనిని మేము పరిశీలించి ప్రయోగించి తెలపడం అయినది కావున దీనిని వినియోగించడం వలన ఎటువంటి సమస్యలు రాడానికి అవకాశం లేదు
ఈ లంకనం చేయడం వలన జీర్ణ వ్యవస్థ పని తీరు వేగవంతం అవుతుంది. శరీరం లోని రక్షణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కావున దీనిని చిన్నా,పెద్ద అనే తారతమ్యం లేకుండా వాడవచ్చు.ఈ సింపుల్ చిట్కాలు పాటించి ఆరోగ్యాన్ని ఆయుష్షును పెంచుకోండి.