కళ్ళు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. కళ్ళు లేకుండా మన జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. తెలిసో తెలియకో చేసే కొన్ని పనుల వల్ల కళ్ళకు నష్టం జరగవచ్చు. దీని వలన కంటి చూపు తగ్గుతుంది. అలాగే ఇతర కంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు ఇప్పుడు మనం చెప్పబోయే విషయాలన్నీ పాటిస్తే అందమైన కళ్ళు పొందడంతో పాటు కంటి సమస్యలు కూడా దూరంగా పెట్టవచ్చు. 5 చెడు అలవాట్లు వల్ల కంటి చూపు అనేది తగ్గుతుంది. 5 చెడు అలవాట్లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిది ఎక్కువ స్క్రీన్ టైం. గత పది సంవత్సరాల్లో కళ్ళజోడు పెట్టుకొని టీనేజర్స్ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దీనికి కారణం అందరికీ తెలిసిందే ఎక్కువగా ఫోన్ టీవీ లాప్టాప్ ఇలాంటివి చూడడమే. అలా మొహం పక్కకి తిప్పకుండా చూడడం వల్ల కళ్లు డ్రై అయిపోతాయి. కంటిచుట్టూ ఉన్న మృతకణాలు చర్మం మీద పేరుకుపోయి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి.
చాలామంది ఉద్యోగాలు కూడా కంప్యూటర్ తో ముడిపడి ఉంటాయి. అయితే ఈ చిట్కాలు పాటించటం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కొంతసేపు మీ సీటు నుండి లేచి వాటర్ తాగడానికి పక్కకు వెళ్ళవచ్చు. ఇలా చేయడం వలన రిలాక్స్ అనిపించడంతో పాటు కళ్లు కూడా తగ్గుతుంది.
కళ్ళను నలపడం: కళ్ళు డ్రైవర్ డం వలన దురద పెడుతుంది ఇలాంటప్పుడు కళ్ళు బాగా నలిపితే కళ్ల కింద ఉండే చిన్న చిన్న కండరాలు దెబ్బతింటాయి అలాగే చేతుల్ని శుభ్రంగా లేకపోతే కళ్ళలోకి క్రిములు చేరి ఇన్ఫెక్షన్ రావచ్చు.
ట్రావెలింగ్ లో చదవడం: ప్రయాణంలో చదవడం వలన కళ్లపై ఒత్తిడి పడుతుంది. మనం ఏ అక్షరాలు అయితే చదవాలి అనుకుంటున్నామో అవి నిలకడగా ఉండకుండా కదులుతూ ఉంటాయి. అలాంటప్పుడు కళ్లపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందుకే ప్రయాణాలు చేస్తున్నప్పుడు బుక్స్ లో చదవడం లేదా ఫోన్ లో మెసేజ్ లు చెక్ చేయడం కూడా మానేయాలి.
సన్ గ్లాసెస్ వాడకపోవడం: సన్ గ్లాసెస్ ఫ్యాషన్ కోసం వేసుకోవడమే కాదు దానివలన సూర్యుని నుండి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ నుండి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి. ఎక్కువగా అల్ట్రా వైలెట్ రేస్‌కి కళ్ళు ఎక్స్పోజ్ అవడం వలన కార్నియా దెబ్బతినే అవకాశం ఉంది.
తక్కువ కాంతి లో చదవడం: కొంతమంది రాత్రి లైట్ ఆపేసి బెడ్ లైట్ కాంతి లో చదువుతూ ఉంటారు. ఇలా చదవడం వలన కంటి చూపు తగ్గుతుంది. కంటి నరాలు దెబ్బ తినకుండా సరైన కాంతిలోనే చదవండి. ఇలాంటి తప్పులు చేయకుండా కంటికి రక్షణ ఇచ్చే విటమిన్ A పుష్కలంగా ఉండే ఆహారాలు, అలవాట్లను అలవర్చుకొని కంటిని కాపాడుకోండి.