చిన్నపిల్లల్లో రంగు పెరగడానికి ఏది పడితే అది రాయడం వలన వారి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉండి ఎలర్జీలకు గురవుతుంటారు. కొంతమందికి సబ్బులు పడవు. తెల్లగా ఉన్న పిల్లలు కూడా నల్లగా మారిపోతుంటారు. కొంతమంది పిల్లలకు కొత్త పదార్థాలు పెడితే శరీరంపై అలర్జీ అవుతుంటుంది. అలాంటివారు చిన్న పిల్లలకు చర్మ రంగును పెంచడానికి ఎటువంటి పదార్థాలు వాడాలి. ఎలా వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న పిల్లలకు అన్ని రకాల నూనెలు లేదా పదార్థాలు సరిపడవు. ఏదైనా కొత్తగా వాడినప్పుడు వారి చర్మంపై ఏమైనా చిన్న చిన్న పొక్కులు, ఎర్ర దద్దుర్లు లాంటివి కనిపిస్తే వారికి పదార్ధాలు సరిపడలేదని అర్థం. అలాంటప్పుడు వాటిని మానేయడం మంచిది. కొంత మంది పుట్టిన పిల్లలకు బయట దొరికే బాడీ ఆయిల్ గాని, కొబ్బరి నూనె కానీ పడకపోవడం మనం గమనిస్తూ ఉంటాం.
అలాంటి పిల్లలకి ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె చాలా బాగా పనిచేస్తాయి. వీటిని చిన్న పిల్లల చర్మం పై రెండు నిమిషాలపాటు మసాజ్ చేయడం వల్ల శరీరం గట్టి పడడంతో పాటు చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. పొడిబారకుండా చర్మం తేమగా ఉండేందుకు పాల మీగడతో మసాజ్ చేయాలి. తర్వాత ఒక స్పూన్ పాల మీగడ కూడా తీసుకొని పిల్లల చర్మంపై ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే మసాజ్ చేయండి.
ఇది చర్మంలో తేమను నింపడంతో పాటు మృదువుగా చేస్తుంది. తరువాత ఇంకొక రెండు స్పూన్ల పాలమీగడ తీసుకొని అందులో ఒక స్పూన్ పెసలను మెత్తగా మిక్సీ చేసి జల్లించిన పౌడర్ తీసుకోవాలి. ఈ పెసరపిండి పాలమీగడలో కలిపి పిల్లల చర్మానికి అప్లై చేయాలి. దీనితో నెమ్మదిగా మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. ఇలా వారానికి మూడు, నాలుగు సార్లు ఉపయోగించడం వలన పిల్లల చర్మంపై మృతకణాలు తొలగిపోయి కాంతివంతంగా తయారవుతారు. ముందు వున్న రంగు కంటే మంచి రంగు తేలుతారు.