ముఖం మెరవడానికి పార్లర్లోనూ, ఇంటిదగ్గర కూడా అనేక రకాల చికిత్సలు చేస్తూ ఉంటాం. కానీ కొంతమందికి ముఖం ఉన్నంత తెల్లగా మిగతా శరీర భాగాలు ఉండవు. దానికి కారణం వాటిపై శ్రద్ధ పెట్టకపోవడం. ఈరోజు మనం ఫుల్ బాడీ వైటెనింగ్ కోసం ఒక చిట్కా గురించి తెలుసుకుందాం. శరీరం మొత్తం తెల్లగా మెరిసిపోవడానికి ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది.
శరీరం పై పేరుకున్న మృతకణాలు తొలగిపోయి, మట్టి, జిడ్డు వంటివి శుభ్రపడి శరీరం కాంతివంతంగా ఉండేలా చేసే ఈ ప్యాక్ తయారీ కోసం మనం ఒక కప్పు పెసలు తీసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒకసారి జల్లించి గరుకుగా ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి.
అలాగే ఒక పెద్ద బీట్రూట్ను పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈ బీట్రూట్ ను కూడా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. నీళ్లు వాడకుండా పేస్ట్లా చేసుకోవాలి. దీని నుండి రసం తీయడానికి ఈ పేస్ట్ ను వడకట్టుకోవాలి. తీసుకున్న బీట్రూట్ రసాన్ని ఒక పాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి.
ఇది కొంచెం మరిగి దగ్గరకు అయిన తరువాత స్టవ్వు ఆపేసి మిక్సీ చేసిపెట్టుకున్న పెసలు పొడిని కొంచెం కొంచెం బీట్రూట్ రసంలో కలపాలి. మొత్తం పొడిని అందులో కలిపే సరికి అది పొడిపొడిగా అవుతుంది. దీనిలో రెండు లేదా మూడు చెంచాల గంధం పొడిని వేయాలి. అలాగే పచ్చి కొమ్ముల నుండి చేసిన పసుపు పొడి రెండు చెంచాలు వేసుకోవాలి. ఈ పౌడర్ అన్నిటిని బాగా కలిపి ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని స్నానానికి వెళ్ళే ముందు రోజ్ వాటర్ తో కలిపి శరీరానికి నలుగులా అప్లై చేయాలి. కొంతసేపు శరీరంపై అలా ఉంచి తరువాత స్క్రబ్ చేస్తూ తీసేయాలి. ఇలా చేయడం వలన శరీరంపై పేర్కొన్న దుమ్ము ధూళి తొలగిపోయి శరీరం తెల్లగా మారుతుంది. ఇందులో వాడిన పదార్ధాలన్నీ శరీరంపై ఉండే మచ్చలు, మరకలు తగ్గించడంలో శరీర కాంతిని పెంపొందించడంలో చాలా బాగా సహాయపడుతాయి.
పసుపు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వలన చర్మంపై ఉంటే మొటిమలు, అలర్జీలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా అప్లై చేయడం వల్ల చాలా మంచి గ్లో వస్తుంది. దీనిని రోజు సబ్బుకు బదులు సున్నిపిండిగా వాడుతూ మంచి చర్మకాంతిని పొందండి.