మీది చామనఛాయ చర్మమైనా లేదా రంగు తగ్గి బాధపడుతున్నా, ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వాడి అలసిపోయినా ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే శరీరం మంచి రంగులోకి మారుతుంది. దీని కోసం మనం తీసుకోవాల్సినవి కేవలం రెండే రెండు పదార్ధాలు.
అవి ఒకటి బీట్ రూట్. బీట్ రూట్ ని పొట్టు తీసి మెత్తని వేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. దీనిని వడకట్టి దీని రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని స్టవ్ పై పెట్టి కొంచెం కలర్ మారేంతవరకు మరిగించాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఇది మరి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీనిలో ఒక కప్పు వరిపిండి కొంచెం కొంచెం మొత్తంలో కలుపుకోవాలి.
ఇది మొత్తం వరి పిండి కలిపే సరికి డ్రైగా అయిపోతుంది. అప్పుడు దీనిని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండి జల్లించడం వలన మెత్తని పిండి వస్తుంది. దీనిని గాజు గ్లాసులో నిల్వచేసుకొని నెల వరకూ స్టోర్ చేసుకోవచ్చు. ఇది నాచురల్ బాత్ పౌడర్. దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పౌడర్ను రెండు చెంచాలు తీసుకొని దీనిలో కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇది చర్మానికి అప్లై చేసుకుని స్క్రబ్ చేసుకునే విధంగా కలుపుకుని ఉండాలి. దీనిని బాడీ మొత్తం రాసుకొని నెమ్మదిగా మసాజ్ చేయాలి. దీనిని మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
ఇలా రోజూ దీనితో స్నానం చేయడం వలన శరీరం మొత్తం మంచి రంగు వస్తుంది. తర్వాత ముఖానికి అప్లై చేయాలి అనుకుంటే దీనిలో ఒక స్పూన్ పాలు ఒక స్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. దీనిని మందంగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఆరిన తర్వాత వాటర్ తో మసాజ్ చేస్తూ రిమూవ్ చేయాలి.
ఒక్కసారి అప్లై చేసినప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ప్యాక్ మీరు తరచు చేస్తూ ఉంటే మీ శరీరం మొత్తం మంచి రంగును సంతరించుకొంటుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.