హలో ఫ్రెండ్స్.. కొందరికి ఏదైనా వెంటనే గుర్తుకు వస్తుంది మరికొందరికి మెదడులో యెంత మననం చేసుకున్న గుర్తుకురాదు. ఇలాంటి సమస్య ఉంటే జ్ఞాపకశక్తి తక్కువగా ఉందిని అంటూ ఉంటారు. అలాగే కొందరికి మతిమరుపు కూడా ఉంటుంది. ఈ సమస్య ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. జ్ఞాపకశక్తి తగ్గడం లేదా వారి చేసే పనిలో ఏకాగ్రత తగ్గిపోవటం.. విద్యార్థులకైతే చదివింది అస్సలు గుర్తు ఉండదు. పెద్ద వారికి కూడా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య వస్తూ ఉంటుంది. దీంతో విద్యార్థులు చదివింది గుర్తు లేక పరీక్షలు సరిగా రాయలేరు. అలాగే ఉత్తీర్ణత కూడా సాధించలేరు.
ఇప్పుడు మనము ఏ ఏ ఆహార పదార్ధాలు తీసుకుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మెదడుకు వచ్చే అనేక సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు అనే విషయం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు కనుక తీసుకుంటే మీ మెదడు మాత్రమే చురుగ్గా ఉండదు మీ మొత్తం శరీర ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ ఆహారాలను మీ పిల్లలకు రెగ్యులర్ డైట్ లో చేర్చడం వలన వారి ఐక్య పెంచడానికి బాగా సహాయపడతాయి. పరీక్షల సమయంలో మీ పిల్లలకు ఇటువంటి ఆహారాలు చాలా అవసరం. అలాగే వారు మెంటలిస్ట్ ఎత్తుగా ఫీలవకుండా చాలా రిలాక్స్ గా కూడా ఉంటారు.
మెదడును చురుకుగా ఉంచుకోవటానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే రకరకాల పండ్లను (యాపిల్) రోజూ తీసుకుంటే మన మెదడుకు చాలా మంచిది . రోజు నాలుగైదు బాదం పలుకులు తింటే మన అందానికి మాత్రమే కాదు మన ఆరోగ్యానికి మన మెదడుకు కూడా చాలా ఉపయోగకరం. బాదం పప్పును రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే వీటి పై పొట్టు తీసి పేస్టులాగా చేసి పిల్లలకు పాలల్లో కలిపి ఇస్తే పిల్లల జ్ఞాపకశక్తి బాగా వృద్ధి అవుతుంది.
మెదడుకు మేత ఇచ్చే ఆహారాలలో వాల్ నట్స్ చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ వాల్ నట్స్ అని చెప్పవచ్చు. గుప్పెడు వాల్ నట్స్ కనుక ప్రతి రోజు తింటే ఎన్నో అనారోగ్యాలకు స్వస్తి చెప్పవచ్చు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా మెదడు చురుగ్గా పని చేయాలన్నా పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడాలని వాల్నట్స్ తింటే సరిపోతుంది.
క్వీన్ అఫ్ స్పైసెస్ (Queen of Spices) గా పిలువబడే మిరియాలు ఘాటుగా ఉన్న మన ఆరోగ్యానికి మాత్రమేకాదు మన మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మిర్యాల లో ఉండే పోషకాలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మెదడును చురుగ్గా చేసి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.
మెదడు చురుగ్గా చేసే వాటిలో సోంపు కూడా చాలా ముఖ్యమైనది. పూర్వం మన పెద్దలు భోజనం చేసిన తర్వాత కంపల్సరిగా సోంపు తినేవారు. దీంతో వారు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ అలవాటు చాలా మందికి లేదు. ప్రతిరోజు మనం భోజనం చేసిన తర్వాత ఒక టీ స్పూన్ మోతాదులో సొంపును తింటే దాంతో ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన మెదడు ని చురుగ్గా మార్చడానికి బాగా పనిచేస్తాయి
గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు