How to Increase Eyesight Digestion Alternative for Tasting Salt

వీటిని మిక్సీ పట్టి వంటల్లో వేసుకుంటే టేస్టింగ్ సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదు……. తద్వారా ఎన్నో జబ్బులు రాకుండా ఆపవచ్చు…

టేస్టింగ్ సాల్ట్ కేవలం రుచిని మాత్రమే అందిస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దీనికి రుచితో పాటు జబ్బులు నిచ్చే గుణం కూడా ఎక్కువగా ఉంది. కనుక దీనికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన ఆకులు మరియు మసాలాలు ఉపయోగించుకుంటే రుచితో పాటు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ టెస్టింగ్ సాల్ట్ ను ఎమ్మెస్సీ లేదా ఎల్ గ్లుటామిక్ యాసిడ్ అని కూడా అంటారు. దీనిని ఎక్కువగా వాడకూడదని గవర్నమెంట్ పరిధులు పెట్టింది. దీనిని ఎక్కువగా ఉపయోగించడం వలన ఏమైనా నష్టాలు వస్తాయి అని ఆలోచిస్తే లెఫ్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది.

                             ఈ హార్మోన్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. మన ఆహారం తిన్న తర్వాత సంతృప్తి చేసే సెంటర్ సాటిస్ఫై అయ్యి లెప్టీన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ టేస్టింగ్ సాల్ట్   వాడటం వలన లెప్టిన్ హార్మోన్ ను కంట్రోల్ చేస్తుంది. దీనివలన ఇంకా ఆకలి ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది. దీనివల్ల ఎక్కువ మందికి ఇన్సూలిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం అవుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రెండవదిగా నరాల పని తీరును దెబ్బతీస్తుంది. ఇవన్నీ టెస్టింగ్ సాల్ట్ వల్ల వచ్చే నష్టాలు. దీనికి నెంబర్ వన్ నేచురల్ ఆల్టర్నేటివ్ పుదీనా.

                           ఇందులో బీటా కెరోటిన్ ఇన్ అనేది 4288 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. ఇది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఈ పుదీనాను వంటల్లో ఉపయోగించుకున్న తర్వాత దీని యొక్క ఫ్లేవర్ మెదడుకు చేరి కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. అందువలన ఆలోచించే తీరు, తర్కం, కాస్త నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇటువంటి వాటిని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే గ్లూటామిక్ యాసిడ్ నాచురల్ గ్లూటామిక్ యాసిడ్. దీనివల్ల డిస్టబెన్స్, ఇరిటెషన్స్ ఉండవు. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూన్ సిస్టం ని డెవలప్ చేస్తుంది.

                     మరియు హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి బాగా చేస్తుంది. రెండవదిగా ధనియాలు. వీటిని పొడి చేసి వాడుకోవడం వల్ల మంచి రుచి, వాసన అందుతుంది. పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మరియు డైజెస్టీవ్ ఇన్ హాన్సర్ గా పనిచేస్తుంది. ఇంకొకటి ఓరిగానో ఇది కూడా మంచి రుచి, వాసనతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మరి శరీరంలో ఇన్ల్ఫమేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడుతుంది. కనుక ఇప్పటినుంచి అయినా ఇటువంటి వాటిని ఉపయోగించు కోవడంతో రుచితో పాటు మంచి ఫ్లేవర్ అందుతుంది…

Leave a Comment

error: Content is protected !!