ప్రస్తుత కాలంలో అందరూ జుట్టు చాలా పల్చగా ఉంటుంది అని బాధపడుతూ ఉంటున్నారు. అటువంటివారు ఇప్పుడు చెప్పబోయే ఈ హెయిర్ టిప్స్ ఉపయోగిస్తే 30 రోజుల్లో పల్చగా ఉన్న జుట్టు ఒత్తుగా అవుతుంది. మొదటి టిప్. దీనికోసం ముందుగా కావాల్సింది ఆపిల్ స్లైడర్ వెనిగర్. దీనికోసం మనం మదర్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించుకోవాలి. ఈ ఆపిల్ స్లైడర్ వెనిగర్ ఉపయోగించడం వలన తలపై ఉన్న సూక్ష్మ రంధ్రాలు తెరవబడి జుట్టు ఎదుగుదలకు సహాయపడతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 200 ml నీటిని పోసుకొని అందులో మూడు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవాలి.
ఆ తర్వాత నీటితో శుభ్రం చేసిన రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని ఒక రోజు రాత్రి అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఆ నీటిని జుట్టు మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రెండవ హెయిర్ టిప్. దీనికోసం మన ఇంట్లో ఉపయోగించే ఏదైనా రెండు స్పూన్ల బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితే ఇంకా ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. బియ్యంను ఒక గాజు సీసాలో తీసుకొని అందులో 200 ml నీటిని పోసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. బియ్యం లో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు ఎదుగుదలలో సహాయపడతాయి.
మరియు మెంతులు మన జుట్టు స్మూత్ అండ్ సిల్కీ కావడానికి సహాయపడతాయి. ఈ మిశ్రమాన్ని ఒక రోజు రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. సమయం ఉంటే రెండు రోజుల పాటు కూడా నానబెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ నీటిని మన తలకు స్ప్రే చేసుకోవాలి. ఇది మన జుట్టుకు మంచి హెయిర్ టానిక్ లాగా పనికొస్తుంది. మూడవ హెయిర్ టిప్. దీనికోసం ఒక గిన్నెలో 200 ml నీటిని తీసుకొని అందులో రెండు స్పూన్ల మనం ఉపయోగించే ఏదైనా టీ పొడిని లేదా కాఫీ పొడిని వేసుకోవాలి.
ఇందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజు రాత్రి మొత్తం నానబెట్టుకొని ఆ తర్వాత ఉపయోగించుకోవాలి. ఇది మన జుట్టు ఎదుగుదలకు మరియు జుట్టు ఒత్తుగా పెరగడానికి బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మూడింటిలో ఏదైనా ఒక టిప్ రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ఉపయోగించుకోవాలి. ఎలా 30 రోజులపాటు ఉపయోగిస్తే మీ జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది