వేరుశనగపప్పును, జీడిపప్పులు మనం ఎంత ఇష్టంగా తింటామో అవి అంత ఆరోగ్యం. వీటితోపాటు అవిస గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల అవిస గింజల్లో 13 గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుంది. దీని వేపించి ఇంట్లో పెట్టుకుంటే ఫ్యామిలీ అంతటికి చాలా చాలా ఉపయోగం. గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా వచ్చినవారికి హెల్దీ గా అవ్వాలన్నా, బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవ్వకుండా ఉండాలన్న, బ్రెయిన్ చాలా హెల్తీగా ఉండి బ్రెయిన్ సెల్స్ కుషించుకోకుండా ఉండాలన్న, మతిమరుపు రాకుండా ఉండాలన్న వీటన్నీటికి ఆల్ ఇన్ వన్ లాక్ పనిచేసే గింజ అవిస గింజ.
దీనిని ఫ్లాక్ సీడ్ అంటారు. ఈ సీడ్ ని ఒకటే నానబెట్టుకుని తినలేము. ఎందుకు అంటే నాన్న పెడితే తినలేము మొలక కట్టుకుని కూడా తినలేము. ఎందుకు అంటే జిగురుగా బంక బంకగా ఉంటాయి. నోటికి అసలు బాగోవు. దీన్ని వేపి తింటేనే కమ్మగా అనిపిస్తుంది. ఈ అవిస గింజల్ని ఎలా వేయించాలి అంటే ముందుగా వీటిని వాటర్ లో వేసి తీసేసి పెనం మీద వేసుకోవాలి అప్పుడు బాగా వేగుతాయి. లేదు అంటే అవిసె గింజలు వేగేటప్పుడు కొన్ని నీళ్లు చల్లి వేపిన కూడా బాగుంటాయి. ఇలా వేపించిన అవిస గింజలని ఎయిర్ టైట్ డబ్బాలో గాని జీప్ కవర్స్ లో గాని పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే కరకరలాడుతూ ఉంటాయి.
పిల్లలకి ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు ఆహారంతో పాటు కొన్ని అవిస గింజలు కూడా పెడుతూ ఉండాలి. ఎప్పుడైనా ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ అవిసె గింజల్ని స్నాక్ లాగా కూడా వాళ్లకి పెట్టొచ్చు. అవిసె గింజల్ని ఎండు ఖర్జూరం పెట్టుకొని కలిపి తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ రోజుకు 1.1-1.3 గ్రామ్ సరిపోతుంది. ఇది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి రోజుకి ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఇంకొక రూపంలో వెళ్లకుండానే దీని ద్వారానే వెళుతుంది. ఈ అవిస గింజల్ని వేపించి పొడి చేసుకుని కూరల్లో పైన చల్లుకుని తింటే చాలా మంచిది.
ఇలా అవిసె గింజల్ని వేపుకుని రోజు వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.