How to increase the length of hair

ఈ నూనె రాసుకున్నట్లయితే బట్టతలపై కూడా వెంట్రుకలు వస్తాయి

ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం సమస్య ప్రతి ఒక్కరికీ చాలా ఎక్కువగా ఉంది. అతి చిన్న వయసులోనే బట్టతల రావడం, జుట్టు ఊడిపోవడం, జుట్టు సన్నగా అయిపోవడం జరుగుతుంది. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ను ఉపయోగిస్తున్నారు. కానీ వాటిలో అనేక రకాల కెమికల్స్  ఉంటాయి. వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటిని ఉపయోగించినట్లయితే బట్ట తలపై కూడా జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. 

       ముందుగా మెంతులను తీసుకొని ఒకసారి బాగా ఎండబెట్టి మెత్తగా మిక్సీలో వేసి  పొడి చేసుకోవాలి. ఈ పొడి  చాలా మెత్తగా ఉండాలి. గరుకుగా అనిపిస్తే ఒకసారి జల్లెడ  పట్టుకుని మళ్ళీ  ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన పొడిని  తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో మూడు చెంచాల మెంతి పిండి వేసుకోవాలి. మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరగడంలో సహాయపడతాయి. జుట్టు కుదుళ్లు బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు కావలసిన మాయిశ్చరైజర్ ను అందిస్తాయి. 

         తర్వాత దీనిలో మెంతిపిండి ఉన్నంతవరకు కొబ్బరి నూనె వేసుకోవాలి. దీనికోసం స్వచ్ఛమైన కొబ్బరినూనె ఉపయోగించుకోవాలి. తర్వాత దీనిలో మూడు చెంచాల ఆముదం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆముదం కూడా జుట్టు రాలడం తగ్గించి  జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయం చేస్తుంది. ఈ మూడింటిని బాగా కలుపుకొని నూనెను డబల్ బాయిలర్ పద్ధతిలో ఐదు నుంచి పది నిమిషాలపాటు బాగా మరిగించాలి.  తర్వాత స్టౌ ఆఫ్ చేసి నూనె ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. 

      నూనెను వారంలో మూడు సార్లు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని తలస్నానం చేయాలి అనుకున్న వాళ్లు రాత్రి  అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి. నూనె  అప్లై చేసినప్పుడు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి  మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  కుదుళ్ళ  నుండి బలంగా తయారవుతుంది. నూనె రాసుకున్న  ప్రతిసారీ డబుల్ బాయిలర్  పద్ధతిలో  వేడి  చేసుకొని రాసుకోవాలి.

      దీనిలో వాడినవి అన్ని  నేచురల్ పదార్థాలు కాబట్టి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు కూడా అవసరం అనిపిస్తే ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!