how to increse Oxygen levels in our body

ఈ ఒక్క చిట్కాతో మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ 95కు పైగా పెరుగుతుంది, అందరూ తప్పకుండా పాటించండి | Oxygen

ఇప్పటి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరతతో ఎంత భయంకర పరిస్థితి నడుస్తుందో అందరికీ తెలిసిందే. క*రోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరొక దారి లేదు. అందుకే ఇమ్యునిటీ పెరగడానికి కొన్ని చిట్కాలు. హాస్పిటల్లో ఆక్సిజన్ అవసరం అయితే ఇప్పుడు అంత త్వరగా దొరకడం  జరగదు.  దీని వల్ల చాలామంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెంచి ఈ చిట్కా గురించి తెలుసుకుందాం.

 దీనికోసం స్టవ్పై ఒక గిన్నె పెట్టి దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. అందులో ఒక స్పూన్ ముల్లేటి పొడి వేసుకోవాలి లేదా మీ దగ్గర ముల్లేటి వేరు ఉన్న వేసుకోవచ్చు. ఈ నీరు ఒక గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిని ఒక గ్లాసులోకి వడకట్టుకుని అందులో స్కూన్ అల్లం రసం, అరస్పూన్ నల్లఉప్పు,  అరస్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. అల్లం రసం, నిమ్మరసం ఊపిరితిత్తులు శుభ్రం చేయడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతాయి. ఊపిరితిత్తులు ఆక్సిజన్ గ్రహించేందుకు సహాయపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 

ఇది క*రోనా వైరస్ సోకిన వారే కాకుండా మామూలుగా ఉన్నప్పుడు కూడా తాగవచ్చు. దీనివల్ల ఛాతీలో పేరుకున్న కఫం కరిగిపోతుంది. అలాగే ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ అవసరమైనవారికి చేయవలసిన చర్య ప్రోనింగ్. అంటే బోర్లా పడుకొని సమాంతరంగా ఉండడం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు ఆక్సిజన్ పీల్చుకొని శక్తి అధికమవుతుంది. దీనిని గర్భిణీ స్త్రీలు, గుండెజబ్బులు ఉన్నవారు, మరికొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నవారు చేయకూడదు. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజులు ప్రాణాయామంతో పాటు ఆక్సిజన్ను పీల్చుకోవడం అధికం చేసే మరో పని ఆవిరి పట్టడం. 

ఆవిరి పట్టడం వలన ముక్కు, గొంతులో ఉండే వైరస్ తొలగిపోవడంతో పాటు ఆక్సిజన్ తీసుకునే శక్తి అధికమవుతుంది. దానికోసం  ఒకటి గిన్నెలో నీరు తీసుకొని అందులో కొంత ఒక స్పూన్ వాము, కొంచెం పసుపు వేసి ఆవిరి వచ్చేంతవరకు మరగబెట్టాలి. దీనిని దుప్పటి కప్పుకొని ఆవిరి పట్టడం వలన వాయునాళం శుభ్రపడుతుంది. అలాగే శరీరంలో ఇమ్యునిటీ పెరుగుతుంది. ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు కోసం యూట్యూబ్లో వెతికితే చాలా రకాలు కనిపిస్తాయి అలాగే కోసం గిన్నె కాకుండా స్ట్రీమింగ్ మెషిన్ కూడా వాడవచ్చు.

Leave a Comment

error: Content is protected !!