టీవీలు, లాప్టాప్ స్క్రీన్లు ఎక్కువగా ఉపయోగించడం వలన ఈ మధ్యకాలంలో చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. అంతగా కంటిపై ఒత్తిడి పడి కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా, కంటికి విశ్రాంతి లేకుండా బ్లూ లైట్స్ బారిన పడటం వలన కంటి దృష్టి బాగా దెబ్బ తింటుంది. చదువుకునే పిల్లలు, ఉద్యోగస్తులు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. అయితే ఇలా దెబ్బతిన్న కంటి చూపును తిరిగి మామూలుగా చేసుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా బాగా పని చేస్తుంది. ఎంతగా పని చేస్తుంది అంటే కళ్ళజోడు విసిరి పడేస్తారు.
దీని కోసం రాత్రి పడుకోవడానికి ముందు మనం నాలుగైదు బాదం పప్పులను నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బాదం పప్పులను పైన తొక్క తీసేసి దీనిలో నాలుగైదు మిరియాలను కూడా వేసి ఒక చెంచా రాళ్ల పటిక లేదా మిస్రీ వేసుకోవాలి. ఈ మూడింటిని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు పాలను మరిగించాలి. దానిలో బాదం మిరియాల పొడిని వేసుకోవాలి. ఇందులోని ఒక యాలకులను దంచి వేసుకోవాలి. ఇది బాగా మరిగిన తరువాత వడకట్టకుండా గ్లాస్ లోకి తీసుకోవాలి. పాలలో యాలకులు కూడా వేయడం వలన మంచి సువాసనతో ఉంటాయి.
ఇందులో వేసిన బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను నివారించి కంటిచూపును పెంచుతుంది. బ్లాక్ పెప్పర్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్వాలిటీ కళ్ళు మరియు శరీరంలోని ఇతర భాగాలలో వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలను కూడా కలిగి ఉంది, ఇవి ఆరోగ్యకరమైన కళ్లతో పాటు బలమైన కంటి చూపును కలిగి ఉండటంలో సహాయపడతాయి. పటిక శరీరంలో వేడిని తగ్గించి కంటిచూపును మెరుగు పరుస్తుంది.
యాలకులు కూడా కంటి చూపు మెరుగు పరచడానికి, తాగిన పాలను త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ పాలను ఎప్పుడు తీసుకోవాలి అంటే ఉదయం టిఫిన్ తిన్న అరగంట తరువాత, నైట్ పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా కనీసం ఒక వారం పాటు చేయడం వలన శరీరంలో వేడి తగ్గి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కంటి చూపు మెరుగు పరచడంతో పాటు పిల్లల్లో ఎముకలు బలంగా, దృఢంగా తయారవుతాయి.