కొద్దిపాటి వర్షాలు పడితే చాలు చుట్టూ పచ్చదనం పెరిగి పోతుంది. మొక్కలు, గడ్డి పెరిగిపోతుంటాయి. ఎక్కడపడితే అక్కడ నీళ్ళు నిల్వ ఉంటాయి. వీటివలన దోమల సంఖ్య పెరిగిపోయి వాటి వల్ల అనేక రోగాల బారిన పడుతుంటారు. మలేరియా, డెంగ్యూ వంటి రోగాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు
అలాగని దోమలను తరిమి కొట్టడానికి జెట్ కాయిల్లాంటివి పెడితే అవి పది సిగరెట్లతో సమానం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ దెబ్బతీయడంలో ఈ కాయిల్స్ చాలా తీవ్రంగా పనిచేస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అలాగని దోమలను వదిలేస్తే అవి కుట్టడం వలన జ్వరాల బారిన పడుతుంటాం. మరి వీటిని తగ్గించుకోవడానికి మనం చేయవలసిన ఒక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సహజ పదార్థాలతో చేసే ఈ చిట్కా దోమలను తరమడమే కాకుండా ఇంట్లో మంచి సువాసనలు కూడా వెదజల్లుతుంది. దాని కోసం మనం పది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వీటిని పై పొట్టు తీసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఒక పది కర్పూరం బిళ్ళలు తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఒక ప్రమిదలో వెల్లుల్లి, కర్పూరం వేసుకోవాలి. దానితో పాటు ఒక స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి అందుబాటులో లేనప్పుడు ఏదైనా నూనె ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంటించడం వలన ఇది మండుతుంది. ఈ మిశ్రమం మండుతున్నప్పుడు వచ్చే వాసనకు దోమలు చచ్చిపోతాయి. ఈ మిశ్రమాన్ని అందించేటప్పుడు కిటికీలు, తలుపులు వేసి ఉంచాలి. ఇలా చేయడం వలన కర్పూరం, వెల్లుల్లి ఘాటు వాసనకు దోమలు తట్టుకోలేవు. వీటి వలన ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు.
దీనితో పాటు రోజూ సాయంత్రం అయ్యేసరికి కిటికీలను మూసేసి ఇంటి బయట ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి చిన్న పిల్లలకు దోమలు కుట్టకుండా మస్కిటో రిపల్లెంట్ క్రీములు రాయాలి. ఇంట్లో దోమలు చేరకుండా పగలు ఎండ, వెలుగు, గాలి ఎక్కువగా సోకేలా జాగ్రత్తలు పడాలి. డోర్లకి మెష్లు పెట్టించడం ద్వారా దోమలు రాకుండా అడ్డుకోవచ్చు.