అధిక బరువును మరియు పొట్టను తగ్గించుకోవాలంటే ఇలా చేయడం చాలా మంచిది. ఉదయం లేవగానే లీటరంపావు నీళ్లు తాగి మలవిసర్జన చేసి మళ్లీ రెండవసారి నీళ్లు తాగి మళ్లీ మలవిసర్జన చేయాలి. 9 గంటలకు సొరకాయ జ్యూస్ తాగాలి. ఇది లివర్ డీ టాక్సిఫికేషన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఈ సొరకాయ జ్యూస్ ని ఫిల్టర్ చేసి 300, గానీ 400ml తీసుకుని దానికి తేనెగాని, నిమ్మరసం గాని కలిపి తాగాలి. 11 గంటలకి టమోటా, కీర దోసకాయ జ్యూస్ తాగాలి దీనికి క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేయవచ్చు వీటిలో బీటా కెరోటిన్ ఉంటుంది. వీటన్నింటి కంటే బీటా కెరోటిన్ బాగా ఎక్కువ ఉన్నది కరివేపాకు లో మాత్రమే ఉంటుంది.
ఈ నాలుగింటిని వాటర్ కూడా కలుపుకుండా గ్రైండ్ చేసి ప్యూర్ జ్యూస్ తీయాలి. ఇలా తీసిన జ్యూస్ ని ఒక 300 ml తీసుకుని తేనె నిమ్మరసం కలిపి తాగాలి. మధ్యాహ్నం వెయిట్ తగ్గాలని అనుకున్నవారు ఒక్కొక్క పుల్కా లేదా రెండు పుల్కాలు మూడు కూరలతో కలిపి తినాలి. ప్రతిరోజు ఆకుకూర మాత్రం ఉండాలి. ఈజీగా బరువు తగ్గుతారు పొట్ట కూడా తగ్గిపోతుంది. బరువు తగ్గకూడదు అనుకునే వారు మాత్రం అన్ పాలిష్ రైస్ తీసుకోవాలి.. సాయంత్రం పూట ఫ్రూట్ జ్యూసులు తాగాలి. దానిలో దానిమ్మ జ్యూస్ తీసుకుంటే డీ టాక్సిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉంటాయి.
కాబట్టి ఇది లివర్ కు చాలా మంచిది. ఏడు గంటలకు కమల జ్యూస్ 300 ml తాగాలి. దీనిలో తేనె కలపకూడదు. అలానే పుల్లపుల్లగా తాగాలి. ఇలా చేస్తే మందు మీద ఉన్న ఆశ తగ్గుతుంది. తర్వాత ఉసిరికాయ ముక్కలను నోట్లో పెట్టుకుని చప్పరించాలి. పడుకునేటప్పుడు ఊసేసి నోరు ఉక్కిరించుకుని పడుకోవాలి. మద్యం మీద మనసు వెళ్ళకుండా ఇలా 21 రోజులు చేయాలి. ఇలా రోజుకి నాలుగు జ్యూసులు తాగడం వల్ల విటమిన్ A, విటమిన్ C, జింక్ ఇలాంటివన్నీ పుష్కలంగా వెళ్తాయి. మధ్యాహ్నం ఆహారం ద్వారా ప్రోటీన్ బీ కాంప్లెక్స్ బాగా వెళ్తాయి. ఇవి అన్ని లివర్ కి ఆయుధాల్ల పని చేస్తాయి.
కాబట్టి ఈ జ్యూసులు తాగడం వల్ల మందు మీద వ్యసనాల మీద ఉన్న ధ్యాసను తగ్గిస్తాయి. ఇలా 21 రోజులు చేస్తే బరువు తగ్గి పొట్ట కూడా తగ్గుతుంది