how to maintain perfect body shape

పర్ఫెక్ట్ షేప్ రావాలంటే పస్తులుండాలా??

అమ్మాయిలు, ఆడవాళ్ళు, అనే బేధం లేకుండా.. ప్రతి ఒక్క మహిళ కూడా అందంగా ఉండాలనే అనుకుంటుంది. అందం అంటే నాజూగ్గా ఉండటమనే భావిస్తారు. దీనికోసం చాలమంది కడుపు మాడ్చుకొని, పస్తులుంటూ నీరసం వచ్చి చివరకి ప్రాణం మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. అయితే, అసలు ఈ విధానం సరైనదా? ఇలా పస్తులుంటే సన్నగా మారతారా?ఒకవేళ సన్నగా మారినా ఇది సరైన పద్ధతిలోనే జరిగిందా? లేదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆరోగ్యకరమైన పద్ధతిలోనే సన్నపడటం సరైన పధ్ధతి అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన పద్ధతి అంటే ఏంటి?

ఆహారంపై నియంత్రణ తప్పనిసరిగా ఉండాలి.. ఒక్కసారిగా ఆహార విషయాలలో మార్పులు చేయకూడదు. క్రమేణా మీ డైట్ లో మార్పును తెస్తూ.. డైట్ ను తగ్గిస్తూ వస్తే.. నీరసం,ఆకలి, అలసట.. రాకుండా ఆరోగ్యంగానే సన్నపడొచ్చు. ఇలా కాకుండా కడుపు మాడ్చుకొని పస్తులుంటూ.. ఒళ్ళు తగ్గాలనుకుంటే మాత్రం వచ్చేది.. తల నొప్పి, ఏ పనిమీద శ్రద్ధ లేకపోవడం, ద్రుష్టి లోపించడం వంటివి.

శరీర బరువు తగ్గాలనుకునేవారు ఆత్రుతను పక్కన పెట్టి నెమ్మదిగా చర్యలు ఆరంభించాలి. ఇందులో బాగంగా..

మొదటగా చేయాల్సింది ప్రతి ఉదయం క్రమం తప్పకుండా ఒకే సమయానికి నిద్ర లేవాలి. ప్రతి రోజు వాకింగ్ చేయడం, అది కూడా మొదట్లో 20 నిమిషాలతో మొదలు పెట్టి.. క్రమేణా ఐదు నిమిషాలు పెంచుతూ పోవాలి..

పస్తులుండకుండా.. ప్రతి రెండు గంటలకోసారి తింటుండాలి. అలానే ఆహార పరిమాణాన్ని నెమ్మదిగా తగ్గించాలి. ఈ విధంగా చేస్తే.. శరీరం కూడా అలవాటు పడి, అనారోగ్య పాలవకుండా.. హుషారుగానే ఉంటూ బరువు తగ్గుతారు..

టీవీ చూస్తూ ఎప్పుడూ తినకండి. ఇలా చేస్తే ఎక్కువ తినే ఆస్కారం ఉంది.. ఆకలి ఉన్నా లేకపోయినా  ఎక్కువ తినేస్తుంటారు. ఇది నామాట కాదు, పరిశోధకుల మాట. వీలైనంత వరకు ఒంటరిగా కాకుండా మరొకరితో కలిసి తింటే.. వారితో పంచుకొని తినడం వల్ల తక్కువ పరిమాణంలో తింటారు.

కడుపుమాడ్చుకొని బరువు త్వరగా తగ్గొచ్చు.. కాని అంతే త్వరగా మళ్ళీ బరువు పెరగడం తధ్యం! ఇది కూడా వైద్య నిపుణులే చెబుతున్నారు.. అలానే మొదట్లో.. బరువు త్వరగా తగ్గినట్లు అనిపిస్తుంది.. ఇది కేవలం శరీరంలో ఉండే అధిక నీరు మోతాదు మాత్రమె..

అందం అంటే.. పర్ఫెక్ట్ ఫిగర్ అంటూ..బక్కగా కనిపించడం అనే బ్రమ నుంచి ప్రతి ఒక్కరు బయటకు రావాలి.

బరువు తగ్గడం చాల సులువు.. సరైన సమయానికి తినడం..పడుకోవడం..లేచి.. వ్యాయామాలు.. చేయడం… అంతే !! ఇట్టే బరువు తగ్గుతారు, ఆరోగ్యంగా, అందంగా ఉంటారు.

Leave a Comment

error: Content is protected !!