How to Make Biotin Powder For Fast Hair Growth and Glowing Skin

బయోటిన్ పౌడర్ కోసం వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తయారు చేసుకోండి

జుట్టు రాలడం, అలసట, నీరసం, నిస్సత్తువ గోళ్ళు పలుచబడి విరిగిపోవడం, చర్మం పాలిపోయినట్టు తయారవడం, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటే మీరు వెంటనే హోంమేడ్ బయోటిన్  పౌడర్ తయారుచేసుకొని ఉపయోగించండి.మార్కెట్లో దొరికే బయోటిన్ పౌడర్లో దొరకే పోషకాలన్నీ ఇందులో లభ్యమవుతాయి.

 ఇది సహజంగానే శరీరానికి శక్తిని, బలాన్ని అందించడంతో పాటు జుట్టు పెరిగేందుకు, అలసట, నీరసం తగ్గేందుకు, గోళ్ళు అందంగా బలంగా పెరిగేందుకు, చాలా బాగా సహాయపడుతుంది. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు పదిహేను బాదం గింజలు, గుమ్మడి గింజలు ఒక స్పూన్, పొద్దుతిరుగుడు గింజలు ఒక స్పూన్, వాల్ నట్స్ ఒక గుప్పెడు, అవిస గింజలు రెండు టేబుల్ స్పూన్స్, నాలుగు స్పూన్ల ఓట్స్ వేసుకొని బాగా కలిపి మిక్సీ పట్టాలి.

 దీనిని మెత్తని పౌడర్ లా చేసుకోవాలి. ఈ పౌడర్ ను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే చాలా రోజులు వరకూ ఉపయోగించుకోవచ్చు. మరీ ఎక్కువ మొత్తంలో కాకుండా ఒక పది రోజులకు సరిపడా చేసుకుంటే తాజాగా ఉపయోగించుకోవచ్చు. పెద్ద వారైతే ఒక స్పూన్ పౌడర్ నేరుగా తినేయవచ్చు. పిల్లలకైతే ఒక స్పూన్ పౌడర్ను మరిగించిన పాలలో బెల్లంతో  కలిపి ఇవ్వవచ్చు. ఇందులో ఉపయోగించిన పదార్థాలన్నీ అనేక పోషకాలు తో నిండి ఉంటాయి. 

జుట్టు పెరగడం శరీరానికి బలాన్ని అందించడమే కాకుండా శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఈ పౌడర్ రుచిలో తినలేనంత  బావుండక పోవడం ఉండదు. ఇది స్త్రీలలో, పిల్లల్లో ఎముకలు బలంగా తయారవడానికి, గోళ్ళు, జుట్టు, చర్మం అందంగా తయారవడానికి చాలా బాగా పనిచేస్తుంది. 

జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో, గౌట్ ఆరోగ్యంగా ఉంచడంలో, అధిక ఆకలిని నియంత్రించడంలో సహాయపడి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో విష పదార్థాలను బయటకు పంపేందుకు  సహాయపడి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివలన చర్మ సమస్యలు మొటిమలు, మచ్చలు వంటివి తగ్గిపోతాయి. అంతేకాకుండా శరీరానికి అనేక రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

Leave a Comment

error: Content is protected !!