how to make chapati more healthy

గోధుమపిండిలో ఇది 1 కలిపితే చాలు మీకు జీవితంలో గ్యాస్,థైరాయిడ్,అధిక బరువు,నరాల బలహీనత,క్యాల్షియం లోపం ఉండదు

హలో ఫ్రెండ్స్ మీరు కనుక గోధుమపిండిలో ఇవి కలుపుకొని తీసుకుంటే చాలు మీ శరీరం లో నీరసం నిస్సత్తువ అధికబరువు హైబీపీ లోబిపి హార్ట్ ఎటాక్ గుండెకు సంబంధించిన సమస్యలు గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రస్తుత సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు ఎంతోమంది తిన్న ఆహారం జీర్ణంకాక అజీర్తి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే గ్యాస్ ఎసిడిటీ వంటి కారణాల మూలంగా మన శరీరంలో 130కి పైగా అనారోగ్య సమస్యలు వస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.

మనం ఎలాంటి పౌష్టికాహారం తీసుకున్నా మనం తిన్న ఆహారంలోని పోషక విలువలు మన శరీరానికి సక్రమంగా అందక పోవడం మూలంగా మన శరీరం నిర్వహించుకోవడం బలహీనంగా మారిపోవడం ఏపని మీద ఏకాగ్రత లేకపోవడం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఈ రెమిడీ మీకు బాగా ఉపయోగపడుతుంది.


గోధుమ పిండి లో కలపవలసిన ముఖ్యమైన పదార్థాలు

ముందు ఒక కప్పు పావు కేజి మోతాదులో గోధుమపిండి తీసుకోండి. ఇందులో ఒక అరచెంచా మోతాదులో వాము  కలపండి. తరువాత ఇందులో అరస్పూను మోతాదులో తెల్ల నువ్వులను కలపండి. ఇప్పుడు ఇందులో అరస్పూను కలోంజీ విత్తనాలు, అవిసె గింజలను కొద్దిగా వేయించి పొడికొట్టి ఒక స్పూన్ మోతాదులో ఇందులో కలపండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పును కలిపి బాగా కలుపుకోండి. కొద్దిగా నీటిని పోసి గోధుమపిండి కలిపినట్లుగా కలుపుకోండి. ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని అలాగే వదిలేయండి. తర్వాత మీరు మామూలుగా చపాతి ఎలా తయారు చేసుకుంటారు అలా తయారు చేసుకుంటే సరిపోతుంది.

వాము లో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరంలో వాపు తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. మన పొట్టకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను నయం చేస్తుంది. మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం చేయడంతోపాటు గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలను కూడా నయం చేస్తుంది.

నువ్వులలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. క్యాల్షియం మన శరీరంలోని ఎముకలు ఉక్కులా గా పటిష్టంగా మారుస్తుంది. నువ్వులలో క్యాల్షియం తో పాటు ఐరన్ మాంగనీస్ మెగ్నీషియం ఫాస్పరస్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో ఎనర్జీని రెట్టింపు చేస్తాయి.

అవిసె గింజలు మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి ఎంతో ముఖ్యమైనది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల మన అధిక బరువు కంట్రోల్లో ఉంటుంది. అంతే కాదు ఇవి మన థైరాయిడ్ లెవెల్స్ ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది.

ఈ చపాతి కనుక మీరు ప్రతి రోజూ తీసుకుంటే మీకు జీవితంలో మీ శరీరంలో క్యాల్షియం లోపం అనేది రాదు. క్యాల్షియం లోపం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి, భుజం నొప్పి , చేతులు నొప్పులు ఇలాంటి ఎన్నో రకాల నొప్పులను రాకుండా చూసుకోవచ్చు. కొంతమందికి మోకాళ్ళ లో టక్ టక్ మని శబ్దం వస్తూ ఉంటుంది అలాంటి సమస్యలు కూడా ఈ చపాతీలు తినడం వలన మీరు శాశ్వతంగా నయం చేసుకోవచ్చు. పెద్ద వాళ్ళు కాదు పిల్లలకు కూడా పెట్టవచ్చు. దీంతో వారి ఎముకలు దృఢంగా మారి వారి ఎదుగుదల కూడా బాగుంటుంది అలాగే కంటి చూపు కూడా రెట్టింపవుతుంది.

డయాబెటిస్తో బాధపడే వారు కూడా ఈ చపాతీని తీసుకోవడం వల్ల మీ రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను క్రమబద్ధీకరించి మీ డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది. మీరు ఒకవేళ రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే ఈ చపాతీలను  తప్పకుండా తీసుకోండి. మీరు కావాలనుకుంటే రోజులో ఒక్క సారి మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో తీసుకోవచ్చు.

40 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలో వచ్చే మోనోపాజ్ సమస్యలు, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలను కూడా నయం చేస్తుంది. మహిళలు రోజూ రెండు లేదా మూడు ఇలా తయారుచేసుకున్న చపాతీలు తింటే మీ శరీరంలో వచ్చే హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలు కూడా నయమవుతాయి. డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

ఎవరైతే జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో జుట్టు బాగా రాలిపోవడం, తెల్ల జుట్టు, డాండ్రఫ్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో  అలాంటి వారు కూడా ఈ చపాతీలను ప్రతి రోజూ తీసుకోండి. ఎవరైతే ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు కూడా ఈ చపాతీలను తప్పకుండా తీసుకోండి.

ప్రతిరోజు ఈ చపాతీలను తీసుకోవడంతో పాటు ఇప్పుడు చెప్పిన లాభాలన్నీ కలగాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి రోజూ మీ డైట్ లో నుంచి తీపిని వీలైనంతవరకు తగ్గించాలి. అలిగి ఫాస్ట్ఫుడ్స్ , కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్స్ ను వీలైనంత వరకు తక్కువగా తీసుకోండి. వీలైతే పూర్తిగా మానేయటం మరీ మంచిది. అధిక బరువును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వాకింగ్ లేదా జాగింగ్ చేయండి. ఆరోగ్యంగా ఉండటానికి మీ శరీరంలో ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండటానికి మీరు ప్రతి రోజు ఒక 15 నిముషాలు ప్రాణయామం కపాలభాతి తప్పకుండా చేయండి. ఇలా చేయడం వల్ల మీ శ్వాస సంబంధిత సమస్యలు కాల్ మీ శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను శాశ్వతంగా నివారించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!