మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయాలి అనుకుంటే మధ్యాహ్నం అయ్యే సరికే మన శరీరం సహకరించక అలసిపోతూ ఉంటాం. అంటే కాలు లాగేస్తూ, నీరసంగా అయిపోవడం, మనకు శక్తి లేనట్టు అయిపోవడం ఇలాంటి విధంగా ఫీల్ అవుతూ ఉంటాం. మనకు చేయాల్సిన పని ఎక్కువగా ఉంటుంది. కానీ మనం శారీరకంగా చేయలేని పరిస్థితిలో ఉంటాం. ఎక్సైజ్ చేసి బరువు తగ్గాలి అనుకున్న వారికి కొంత సేపు ఎక్సైజ్ చేసేసరికి ఇంకా చేయలేము అనే స్థితికి వచ్చేస్తారు. ఇలాంటి సామర్థ్యాన్ని మనకు పెంచడానికి మనకు ఏదైనా ఎనర్జీ డ్రింక్ తాగుదామా అని అనుకుంటారు.
కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్రోటీన్ షేక్ ఇలాంటి వాటికంటే కూడా ఎనర్జీ లెవెల్స్ ను, పని సామర్ధ్యాన్ని, ఎక్సైజ్ కెపాసిటీని మీ మజిల్స్ అంతటికి 20% సామర్ధ్యాన్ని ఇంక్రీజ్ చేయడానికి నోని జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. 2008వ సంవత్సరంలో థహీటీయాన్ నోని ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ యూఎస్ఏ వారు స్పెషల్ గా వీటి పైన మన పని సామర్థ్యం 20% పైన ఇంక్రీజ్ అవుతుంది అని నోని ఫ్రూట్ జ్యూస్ గనుక తీసుకుంటే అని తెలిపారు. ఉదయం 20ml, సాయంత్రం 20ml ఇలా మూడు వారాలు చేసుకునే సరికి మన పని సామర్థ్యం 20% పైన ఇంక్రీజ్ అవుతుంది.
ఈ నోని జ్యూస్ మీకు రెడీమేడ్ గా మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఇప్పుడు అందరికీ బాగా అలవాటు అయింది. స్పెషల్గా ఇందులో పని సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఏముంది అంటే ఈ నోని జ్యూస్ లో ఉండే ఆంటీ ఇంప్లిమెంటరీ కెమికల్స్ కండరాల్లో రిలీజ్ అయ్యే పోస్టాగ్లాండిల్స్ ను ఆపేసి కండరాలు అన్ని 30% త్వరగా రిలాక్స్ అయ్యేటట్లు ఈ జ్యూస్ చేయగలుగుతుంది. అంటే కండరాలు రెండు గంటలు పని చేసేసరికి అలసటకు గురి అయితే ఈ జ్యూస్ తాగడం వలన 30% ఎనర్జీ మరల వెనుకకు వస్తుంది.
నోని జ్యూస్ నాచురల్ గా త్వరగా మన సామర్థ్యాన్ని, ఎక్ససైజ్ సామర్ధ్యాన్ని పెంచడానికి, ఇంకా అన్నిటిలో ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అని నిరూపించబడింది. కాబట్టి ఇటువంటి జ్యూస్ అందరూ ఉపయోగించుకోగలిగితే చాలా మంచిది. మన పని సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు.