తెల్ల జుట్టు సమస్య అధికంగా ఉన్నవారు పాటించవలసిన కొన్ని చిట్కాలు ఆయుర్వేద నిపుణులు సూచించబడినవి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో మెలనిన్ తగ్గడం, అధికంగా ఒత్తిడికి గురవడం, వంశపారంపర్యంగా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావడం వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణం. వంశ పారంపర్యం కారణంగా వచ్చిన తెల్లజుట్టును మనం తగ్గించడం కష్టం. కానీ మిగతా కారణాలు మనం తీసుకునే ఆహారం పోషకాలతో ఉండేలా చూసుకోవడం ద్వారా, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి కొంచెం అదుపులో పెడతాయి. అలాగే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ఆయిల్ తెల్లజుట్టు సమస్యను ప్రారంభ దశలోనే నివారిస్తుంది.
దాని కోసం ఒక కప్పు ఆవనూనె తీసుకోవాలి. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది జుట్టు పెరుగుదలకు, తెల్ల జుట్టు నిరోధించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత గోరింటాకు లేత ఆకులను సేకరించాలి. లేత ఆకులు ఎర్రటి ఈనే ఉంటుంది. వీటిని సేకరించి ఎండలో ఆరబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక స్పూన్ గోరింటాకు పొడిని తీసుకోవాలి. ఆవనూనెలో గోరింటాకు పొడిని కలిపి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి. ఇలా వేడి చేసిన నూనెను మళ్ళి ఒక రోజంతా ఎండలో ఉండనివ్వాలి. ఇలా చేయడం వలన గోరింటాకులోని గుణాలు నూనెలోకి దిగుతాయి. ఇలా తయారైన నూనెను జుట్టుకు వారానికి రెండు సార్లు నెమ్మదిగా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. అలాగే ఒక పావు కప్పు నిమ్మ రసం తీసుకొని దానిలో ఒక టీ స్పూన్ ఉసిరికాయ పొడి కలపాలి.
ఈ రెండింటినీ బాగా కలిపి జుట్టుకు అప్లై చేసి ఆరిన తర్వాత తల స్నానం చేయాలి. ఈ ప్యాక్ను వారానికి రెండు సార్లు ఉపయోగించడం వలన చుండ్రు, దురదలు వంటి సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా నల్లగా పెరుగుతుంది. ఇక మూడవ చిట్కా కోసం ఒక లీటరు కొబ్బరి నూనె , 100 గ్రాముల ఉసిరిపొడి, 100 గ్రాములు శీకాకాయ పొడి, 100 గ్రాములు బ్రాహ్మీ పొడి, 100 గ్రాముల బృంగరాజ్ ,100 గ్రాముల గోరింటాకు పొడి తీసుకోవాలి. వీటన్నింటిని నూనెలో కలిపి బాగా మరిగించాలి.
నూనె మంచి ముదురు రంగులోకి మారుతుంది. ఈ నూనెను చల్లారనిచ్చి వడకట్టిన తర్వాత వారానికి కనీసం రెండుసార్లు నూనె తలకు అప్లై చేసి మంచిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి మెలనిన్ స్టిమ్యులేట్ అవుతుంది. జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. దీనితో పాటు ప్రతిరోజు రాత్రి ఒక స్పూన్ త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగడం వలన జుట్టు నల్లగా ఉంటుంది లేదా ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వలన కూడా జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఉంటుంది.