ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల వలన వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారికి కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. తెల్ల వెంట్రుకలు రావడం తగ్గించుకోవడం కోసం, వచ్చినవి నల్ల బడటం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డైస్,ఆయిల్స్ ఉపయోగిస్తారు. వాటిలో కెమికల్స్ ఉండటం వలన ఉన్న సమస్యకి తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. కానీ మున్ముందు కెమికల్స్ వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ పద్దతిలో తెల్ల వెంట్రుకలను ఈజీగా నల్లగా మార్చుకోవచ్చు.
ఈ నాచురల్ హెయిర్ కలర్ ఉపయోగించడం జుట్టు నల్లబడటమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. దీనికోసం ముందుగా మీ జుట్టుకు సరిపడినంత బీట్రూట్ ఒకటి లేదా రెండిటిని తీసుకోవాలి. బీట్రూట్ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొన్ని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ఏదైనా క్లోత్ లో వేసి వడకట్టుకుని జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఇనుప కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి.
దీనిలో ఒక కప్ ఉసిరికాయ పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత దీనిలో మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న బీట్ రూట్ జ్యూస్ వేసి దగ్గరకి అయ్యేంతవరకు ఉండనివ్వాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఆ పేస్ట్ కడాయి మొత్తం సర్ది మూత పెట్టాలి. ఈ మిశ్రమంలో ఐరన్ కలవడం వలన బ్లాక్ కలర్ లోకి వస్తుంది . ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు తెల్ల వెంట్రుకలు మొత్తం కవర్ అయ్యేలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత రెండు గంటల పాటు ఆరనివ్వాలి.
తర్వాత ఏదైనా హోమ్ మేడ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా కుదిరితే వారానికి ఒకసారి చేయడం వలన తెల్ల వెంట్రుకలు శాశ్వతంగా పోతాయి. ఉసిరి పొడి జుట్టు నల్లగా చేయడమే కాకుండా చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొండగట్టు అంజన్న పదార్థం జుట్టు కుదుళ్లు బలంగా చేసి జుట్టు నల్లగా చేయడంలో సహాయపడుతుంది. చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చిన వారు కూడా ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది.