how to make oil for knee and joint pain

ఇవి ఎముకల్లో మజ్జను బాగా పెంచి మోకాళ్ళ నొప్పిని వెంటనే తీసి పడేస్తుంది……

కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాల్లో నువ్వులు నెంబర్ వన్ అని అందరికీ తెలిసిందే. ఎముకలు బాగా పుష్టిగా ఉండాలి అన్నా, ఆస్ట్రీయోఫోరసిస్ రాకుండా ఉండాలి అన్నా ఆహారంలో నువ్వులను ఏదో ఒక రూపంలో ఉపయోగించుకోవడం మంచిది. నువ్వులను కాల్షియం కొరకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్న, ఆస్ట్రీయోఫోరసీస్ ఉన్న, రకారకల ఆర్ధట్రైటీస్ తో బాధపడే వారికి ఇవి ఉపయోగపడతాయి అని సైంటిఫిక్ గా నిరూపించబడింది. అలాగే నొప్పులు ప్రారంభ దశలో ఉన్న వారికి కూడా ఉపయోగపడతాయి.

                            నువ్వులలో ఉండే ఫైటో కెమికల్స్ మరియు కాల్షియం నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. ఎముకల మధ్యలో జిగురు ఉత్పత్తి కాకపోయినా, కార్టీలైజ్ దెబ్బతిన్నా సరే వాటి ద్వారా వచ్చే నొప్పులు బ్రహ్మాండంగా తగ్గిస్తున్నాయని 2014వ సంవత్సరంలో సెర్బీయా దేశం వారు నువ్వులను రోజుకు 15 గ్రాములు మీరు ఏ రూపంలో వాడినా నెల రోజులు వాడే సరికి 51% ఇన్ఫ్లమేషన్ జాయింట్స్ లో తగ్గుతుంది అనీ నిరూపించారు. కాబట్టి నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడతాయని నిరూపించారు.

                         కాబట్టీ ఆస్ట్రీయోఫొరోసిస్, ఆర్ధ్రటైటీస్ బాధపడే వారికి గాని, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వలన వచ్చే ఇబ్బందులు ఉన్నవారు కానీ నువ్వులను వాడుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా నువ్వుల వల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కలిగే రెండవ లాభం ఏంటంటే నువ్వులలో సిసామీన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఎముక ఎముక మధ్యలో కార్టీలేజ్ అనే పొర ఉంటుంది. ఇది డామేజ్ అయినప్పుడు నొప్పులు వస్తాయి. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ ను నువ్వుల ఉండే సీసామీన్ అనే కెమికల్ కాంపౌండ్ డామేజ్ కాకుండా రక్షిస్తుంది. ఇది రెండవ లాభం.

                      అలాగే నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాల్షియం వలన వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆస్ట్రీయోఫోరోసీస్ లాంటి ఎముకలు గుల్లభారకుండా, ఎముకలు బలంగా ఉండేటట్లు, శరీరం కొంచెం ఎక్కువ బరువు ఉన్న శరీరం మొత్తాన్ని మోసేటట్టు ఎముకలను స్ట్రాంగ్ గా నువ్వులు తయారుచేస్తాయి. ఇలాంటి మూడు లాభాలను మోకాలు నొప్పితో బాధపడే వారికి నువ్వులను రోజుకి 10- 15 గ్రాములు చక్కగా ఉపయోగించుకుని వాడితే అటువంటి లాభాలను పొందవచ్చు. ఇటువంటి నువ్వులను నువ్వుల ఉండల రూపంలో లేదా నువ్వుల పొడి చేసుకుని కూరల్లో వాటిలో ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా లాభం పొందవచ్చు…

Leave a Comment

error: Content is protected !!