ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు వలన వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు.వీటిని తగ్గించుకోవడం కోసం రకరకాల మందులను ఉపయోగిస్తున్నారు. వాటివలన తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత ఉపశమనం లభించట్లేదు.వీటిని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఈ నూనె అద్భుతంగా పని చేస్తుంది.
ఈ నూనె ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ఇనుప కడాయి తీసుకొని దానిలో 100 గ్రాముల ఆముదం తీసుకోవాలి. తర్వాత దీనిలో 100 గ్రాముల కానుగ నూనె వేసుకోవాలి. తర్వాత 100 గ్రాముల ఆవనూనె, 100 గ్రాముల నువ్వుల నూనె, 100 గ్రాముల వేప నూనె వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టి పది నిముషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె మీద మూత పెట్టుకోవాలి.
నూనె చల్లారిన తర్వాత 50 గ్రాముల పచ్చ కర్పూరం తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని మనం మరిగించి చల్లార్చుకున్న నూనెలో వేసుకోవాలి. నూనె వేడిగా ఉన్నపుడు వేస్తే నూనె పొంగిపోతుంది. తర్వాత దీనిలో 10ml యూకలిఫ్టస్ ఆయిల్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని ఏదైనా గాజు సీసాలో వేసుకోవాలి.ఈ నూనె రాత్రి పడుకునే ముందు నూనెను గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న భాగంలో అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత నూనె ఇంకిపోయేంతవరకు మర్దన చేసుకోవాలి.
ఇలా వరుసగా ఒక వారం రోజుల పాటు చేసినట్లయితే ఎటువంటి నొప్పి అయినా తగ్గుతుంది. మంచం మీద నుండి లేచి నడవలేని వారు సైతం నడుస్తారు. ఈ నూనె ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ నూనె నొప్పులతో బాధపడే వారు ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ నూనె ఉపయోగిస్తూ అధిక బరువు సమస్య తగ్గించుకోవడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయడం వలన కొంతvవరకు ఉపశమనం లభిస్తుంది. మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళు నొప్పులు వంటి సమస్యలతో బాధ పడేవారు ఈ నూనెను తయారుచేసుకుని వాడినట్లయితే తేడా గమనిస్తారు. చాలా బాగా పనిచేస్తుంది. ఈ చిట్కా మీకు కూడా అవసరం అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి.